Samantha : అనారోగ్యం కారణంగా ఏడాది వరకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu). ఇప్పుడు కోలుకోవడంతో మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా ఆమె పలు సినిమాలను నిర్మిస్తుంది. అంతే కాకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆమె వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది అనే టాక్ ఒకటి బలంగా మీడియా లో నడుస్తుంది. ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు, అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో రాబోతున్న సినిమానే. ఈ ప్రాజెక్ట్ ని మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రకటించారు.
Also Raead : సమంత 2వ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..వరుడు విషయంలో ఊహించని ట్విస్ట్!
సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సన్ పిక్చర్స్(Sun Pictures) సంస్థ దాదాపుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేయబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుకు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ని తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె రాజమౌళి(SS Rajamouli) ప్రాజెక్ట్ లో ఉండడంతో మరో ప్రాజెక్ట్ చేసే వీళ్ళు లేనందున ఈ సినిమాలో నటించలేనని డైరెక్టర్ అట్లీ తో చెప్పిందట. నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ కావడంతో, ప్రియాంక చోప్రా కాకుండా, ఆ క్యారక్టర్ కి ఎవరు న్యాయం చేయగలరు అని డైరెక్టర్ ఆలోచిస్తున్న సమయంలో అల్లు అర్జున్ సమంత పేరు ని ప్రస్తావించాడట. డైరెక్టర్ అట్లీ కూడా గతంలో సమంత తో ‘మెర్సల్’, ‘తేరి’ వంటి చిత్రాలు చేశాడు. అల్లు అర్జున్ ఆమె పేరు ప్రస్తవించిన వెంటనే అంగీకరించి , వెంటనే సమంత ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వివరించాడట.
ఆమెకు కథ చాలా బాగా నచ్చడంతో వెంటనే ఈ చిత్రంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలం లో సమంత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆమె చివరిసారిగా మన తెలుగు ఆడియన్స్ కి ‘ఖుషి’ చిత్రం ద్వారా కనిపించింది. ఇందులో ఆమె రెగ్యులర్ హీరోయిన్ క్యారక్టర్ చేసినప్పటికీ, నటనకు ప్రాధాన్యత ఉంది. అలా సెలెక్టివ్ స్క్రిప్ట్స్ తో ముందుకు వెళ్తుంది సమంత. కథ నచ్చితే ఆమె విలన్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. మరి అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో ఆమె ఎలా కనిపించబోతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందులో ఒక క్యారక్టర్ నెగెటివ్ గా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన పోషించే రెండు క్యారెక్టర్స్ కి సంబంధించిన లుక్ టెస్ట్స్ కూడా పూర్తి అయ్యాయి. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read : ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత..మొదటి పోస్ట్ అతనిపైనే!