Samantha : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సమంత(Samantha Ruth Prabhu). మొదటి సినిమాతోనే ఆమె ఈ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టింది. రెండవ, మూడవ సినిమాలతోనే ఎన్టీఆర్(Junior NTR), మహేష్ బాబు(Superstar Mahesh Babu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వంటి సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఎంత మంది హీరోయిన్స్ కి దొరుకుంటుంది చెప్పండి?, అలాంటి అద్భుతమైన అవకాశాలను సంపాదించుకోవడమే కాదు, ఆ అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ ని అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో సరిసమైనమైన ఇమేజ్ ని నటిగా సంపాదించుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా కూడా తన సత్తా ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత, ఇప్పుడు పూర్తిగా కోలుకొని రీ ఎంట్రీ ఇస్తూ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించింది. ఈ సంస్థ లో మొట్టమొదటి చిత్రం గా ఆమె నిర్మించిన ‘శుభమ్’ అనే చిత్రం మే9 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఆమె ఫుల్ బిజీ గా ఉన్నది. అందులో భాగంగా ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ సంస్థలో స్టార్ హీరోల సినిమాలను కూడా నిర్మించే అవకాశం ఉంటుందా? ‘ అని అడగ్గా, దానికి సమంత విచిత్రమైన సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘కచ్చితంగా చేస్తాను. చేయను అని చెప్పను. కానీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అందరిని సమాన భావం తో చూస్తుంది. సమానమైన టాలెంట్, సమానమైన అనుభవం, సమానమైన రెమ్యూనరేషన్..ఇదే ట్రాలాలా సూత్రాలు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు. చాలా గొప్పగా చెప్పారు, మీరు కూడా హీరోయిన్ గా చేసేటప్పుడు మీ తోటి ఆర్టిస్టులతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారా?, క్యారక్టర్ ఆర్టిస్ట్ తో సమానంగా మీరు రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోకూడదు? అంటూ నిలదీశారు. నువ్వు మాత్రం హీరోయిన్ గా కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటావు, నీ సంస్థ లో పని చేసే హీరో కి, క్యారక్టర్ ఆర్టిస్ట్ కి మాత్రం సమానమైన పేమెంట్ అంటావు, ఇలా స్టార్ హీరోల సినిమాలకు వర్కౌట్ అవ్వవు, కాబట్టి నువ్వెప్పుడూ స్టార్ హీరోలతో సినిమాలు చేయలేవు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. నిర్మాతగా సమంత ఎంత మేరకు సక్సెస్ అవుతుందో ఈ చిత్రం ద్వారా తేలిపోనుంది. ట్రైలర్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత
Would you produce films with stars in the future?#Samantha : EQUAL SKILL. EQUAL EXPERIENCE. EQUAL PAY pic.twitter.com/CswDGYNF86
— Gulte (@GulteOfficial) May 6, 2025