Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. అంటే సుమారుగా ఐదేళ్ల పాటు మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ మూవీ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఒడిశా లో, రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో శంకర్ పల్లి లో గత వారం రోజుల పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య ఒక పాటని చిత్రీకరించారు. దాంతో ఆ షెడ్యూల్ ముగిసింది. తదుపరి షెడ్యూల్ మొదలు అయ్యే ముందు 40 రోజుల పాటు మహేష్ బాబు సమ్మర్ హాలిడేస్ ని తీసుకున్నాడు. ఈసారి మొదలు అవ్వబోయే షెడ్యూల్ చాలా భారీగా ఉండబోతుంది.
Also Read : పెద్ది’ షాట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎలా క్రియేట్ చేశారంటే!
ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో ఇప్పటి నుండే చర్చలు మొదలు అయ్యాయి. సందీప్ వంగ తో ఒక సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమా తో పాటు ఆయన ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చి బాబు తో కూడా ఆయన ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చర్చ రాజమౌళి తో సినిమా మొదలు అయ్యే ముందే జరిగిందట. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా సూపర్ స్టార్స్ అందరికీ స్టోరీలు వినిపించాడట. రామ్ చరణ్ తో ఇప్పుడు సెట్ అయ్యింది. మహేష్ బాబు తో ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, కచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం నిజం అని అంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆయన ‘పెద్ది’ మూవీ షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో జరుగుతుంది. రామ్ చరణ్ తో పాటు ఇతర తారాగణం కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ముఖ్యంగా IPL సీజన్ లో టాప్ మోస్ట్ టీమ్స్ మొత్తం ఈ గ్లింప్స్ కి స్పూఫ్ చేస్తూ హల్చల్ చేశారు. రీసెంట్ గానే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈ గ్లింప్స్ వీడియో ని ఎలా రీ క్రియేట్ చేసారో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పెద్ది సిగ్నేచర్ షాట్ అంతలా వైరల్ అయ్యింది. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా, మార్చ్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!