Aamir Khan and Allu Arjun : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన సృష్టించిన భీభత్సం మామూలుది కాదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమాతో ఏకంగా నార్త్ ఇండియా లో జెండా పాతేసాడు. అల్లు అర్జున్ క్రేజ్ ని చూసి నార్త్ లో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ కుళ్ళుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి స్టార్ హీరో దేశం గర్వించ దగ్గ హీరోలలో ఒకరైన అమీర్ ఖాన్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుందో ఊహించగలమా?, కానీ నిన్న అదే జరిగింది. ముంబై లో అల్లు అర్జున్ అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లి కాసేపు అతనితో సుదీర్ఘంగా చర్చించాడు.
Also Read : మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే!
అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది . అమీర్ ఖాన్(Amir Khan) ఈమధ్య కాలంలో సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఇది కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆయన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ ఏడాది గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పైనే ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ని అయితే చాలా తేలికగా దాటేసింది కానీ, అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం కలెక్షన్స్ ని మాత్రం దాటలేకపోయింది. ఇప్పటికీ ఇండియా లో నెంబర్ 1 గ్రాసర్ గా దంగల్ చిత్రమే కొనసాగుతుంది.
2016 వ సంవత్సరం లో విడుదలైన ఒక సినిమా ఇప్పటికీ టాప్ లో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు అమీర్ ఖాన్ స్టార్ పవర్ ఎలాంటిది అనేది. ఇలా రెండు ఇండస్ట్రీస్ కి చెందిన సూపర్ స్టార్స్ చేతులు కలపడం చూస్తుంటే కచ్చితంగా వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర ఏదైనా పోషించబోతున్నాడా?, లేకపోతే ఇది సాధారణ మీటింగ్ యేనా అని చాచించుకుంటున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అప్పట్లో అమీర్ ఖాన్ తో హిందీ లో ‘గజినీ’ చిత్రాన్ని నిర్మించాడు. అప్పటి నుండే అల్లు అర్జున్ కి అమీర్ ఖాన్ పరిచయం. వాళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, అందులో భాగంగానే కలిశారని అంటున్నారు.
Also Read : 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్… ఆమెతో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించిన అమిర్ ఖాన్! ఎవరీ గౌరీ స్ప్రాట్