https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8’లో ఈ వారం ‘నో ఎలిమినేషన్’.. చివరి నిమిషంలో ట్విస్టులు ఊహాతీతం!

ఈ సీజన్ లో నిఖిల్ కోసం అమర్ దీప్, విష్ణు ప్రియ కోసం యాంకర్ రవి, అవినాష్ కోసం గెటప్ శ్రీను, రోహిణి కోసం శివాజీ, టేస్టీ తేజ కోసం వీజే సన్నీ, ప్రేరణ కోసం ప్రియ ఇలా సెలబ్రిటీస్ అందరూ వస్తారు. వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2024 / 08:53 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి అవినాష్, యష్మీ, విష్ణు ప్రియ, గౌతమ్, టేస్టీ తేజ మరియు పృథ్వీ నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆడియన్స్ లో ఒక రేంజ్ ఉత్కంఠ ఉన్నింది ఈ వారం మొత్తం. ఎందుకంటే సోషల్ మీడియా లో జరిగే పోలింగ్స్ ప్రకారం చూస్తే గౌతమ్ కి తప్ప మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ కి సరిసమానమైన ఓటింగ్ వచ్చింది. కేవలం వందల ఓట్ల మధ్యనే తేడా ఉన్నింది. ఈ 5 మందిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు, అది ఎవరు అనేది మాత్రం చెప్పలేకపోయారు నెటిజెన్స్. శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. కాసేపట్లో శనివారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ లో పృథ్వీ, గౌతమ్ సేవ్ అవుతారు.

    ఆదివారం ఎపిసోడ్ లో యష్మీ, విష్ణు ప్రియ సేవ్ అవుతారు. చివరి ఎలిమినేషన్ రౌండ్ లో అవినాష్, టేస్టీ తేజ ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ఉపయోగించి ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే ఉద్దేశ్యం ఉందా అని నబీల్ ని నాగార్జున అడగగా, దానికి నబీల్ నేను ఎవరికీ ఉపయోగించాలని అనుకోవడం లేదు సార్ అని అంటాడు. ఆ తర్వాత హౌస్ మొత్తం ఉత్కంఠ గా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది గోర్లు కొరుక్కుంటూ ఎదురు చూస్తుంటారు. అప్పుడు నాగార్జున ఇద్దరు సేఫ్, ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటిస్తాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ రెండు ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వీకెండ్ లో ప్రతీ సీజన్ లోనూ కంటెస్టెంట్స్ కి సంబంధించిన సెలబ్రిటీ స్నేహితులు మరియు ఒక కుటుంబ సభ్యుడు వస్తారు.

    వీళ్ళు కాసేపు తమ అభిమాన కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తర్వాత తమ దృష్టిలో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ ని పెట్టమంటాడు నాగార్జున. అదే ప్రక్రియ ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కూడా జరగనుంది. ఈ సీజన్ లో నిఖిల్ కోసం అమర్ దీప్, విష్ణు ప్రియ కోసం యాంకర్ రవి, అవినాష్ కోసం గెటప్ శ్రీను, రోహిణి కోసం శివాజీ, టేస్టీ తేజ కోసం వీజే సన్నీ, ప్రేరణ కోసం ప్రియ ఇలా సెలబ్రిటీస్ అందరూ వస్తారు. వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమోలో శివాజీ టేస్టీ తేజ తో చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లంతా ఈరోజే వస్తారా, లేకపోతే రేపు కూడా ఇదే ఎపిసోడ్ కొనసాగుతుందా అనేది చూడాలి. ఈ ఎపిసోడ్ చాలా కీలకమైనది, హౌస్ మేట్స్ అందరికి టాప్ 5 లో ఎవరెవరు ఉండబోతున్నారో ఈ ఎపిసోడ్ లోనే తెలిసిపోతుంది.