Samantha: సమంత మయోసిటిస్ అనే వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక దానివల్లనే కొద్ది రోజులు ఈ హీరోయిన్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే తాను హీరోయిన్ గా ఒప్పుకున్నా విజయ్ దేవరకొండ సినిమా ఖుషి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.. ఇక పూర్తిగా కోలుకోకపోయినా కానీ, సమంత తన సినిమా శాకుంతలం కోసం బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించింది.
మరో పక్క తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ఆరోగ్యం గురించి సమంత స్వయంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ వుంది. అయితే సమంత పూర్తిగా అనారోగ్యం నుంచి బయట పడకపోవడం వల్ల, తాను కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరోగ్యంపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకొంది. దానికి తగ్గట్టుగానే ఖుషి సినిమాకి, సిటాడెల్ కి డేట్స్ అడ్జస్ట్ చేసి షూటింగ్ కూడా ముగించింది.
ఇక ఖుషి సినిమా తర్వాత ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు. అయితే తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా, తాను ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో సమంత పాల్గొనడమే కాదు హుషారుగా డాన్స్ కూడా చేసింది. నిజానికి సోమవారం నుంచే సమంత ఆరోగ్యం బాలేదు. కానీ సమంత సోమవారం మొత్తం డాన్స్ ప్రాక్టీస్ చేసి మంగళవారం విజయ్ తో కలిసి లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న చాలామంది హీరోయిన్స్, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకొని తమ ఆరోగ్యం బాగున్నా కానీ ప్రమోషన్స్ కి రామని ప్రొడ్యూసర్లను విసిగిస్తూ ఉంటారు. కానీ సమంత అలా కాదు.. తన రూట్ సపరేట్. తన వల్ల ఎవరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో, తన సినిమా ప్రమోషన్స్ బాధ్యత తానే తీసుకొని తానే ముందుకు వస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత బయటకు రాను అని చెప్పిన.. చిత్ర యూనిట్ ఒప్పుకుంటారు.. అలానే ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. కానీ.. తనకు సినిమాపై ఉన్న ప్రేమతో ప్రమోషన్లలో ఓపిగ్గా పాల్గొంటోంది. ఇంటర్వ్యూలు ఇవ్వటమే కాకుండా.. డాన్సులు కూడా చేసేస్తోంది.
తమ సినిమా గురించి అసలు ఏమి పట్టించుకోకుండా కేవలం రెమ్యూనరేషన్ మాత్రం తీసుకునే హీరోయిన్స్ ఉన్న ఈ తరుణంలో, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిర్మాత గురించి ఆలోచిస్తున్న సమంత ని చూసి తన అభిమానులు ఇది మా సమంత అంటే అని ఆనంద పడిపోతున్నారు. యశోద సినిమాలో రీల్ ఫైటర్ గా కనిపించిన ఈ హీరోయిన్, రియల్ గా కూడా ఫైటరే అని, తాను చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అర్థమవ్వక మానదు.