https://oktelugu.com/

Oo Antava Song: “ఊ అంటావా మావా” సాంగ్ పై స్పందించిన సమంత…

Oo Antava Song: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 01:22 PM IST
    Follow us on

    Oo Antava Song: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి.

    ముఖ్యంగా పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊ అంటావా మావా… ఊహు అంటావా అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏తో సంచలనం సృష్టించింది. ఈపాటలో సమంత స్టెప్స్, ఎక్స్‏ప్రెషన్స్‏కు యూత్ ఫిదా అయ్యారు. అలాగే ఈపాటకు మరో స్పెషాలిటీ.. వాయిస్.. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్ తన గొంతుతో మాయ చేసింది. ఈ పాటలోని లిరిక్స్ మగవాళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలసిందే. తాజాగా ఈ పాట గురించి సమంత తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది.

    https://twitter.com/Samanthaprabhu2/status/1472581198471843844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472581198471843844%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsamantha-shares-pushpa-special-song-trolling-video-goes-viral-in-social-media-600156.html

    కొందరు యువకులు ఈ పాటను షార్ట్ వీడియోగా తీసి ఫన్ క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ముగ్గురు యువకులు పుష్ప స్పెషల్ సాంగ్ ను ట్రోల్ చేశారు. ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదరా.. అంటే ఎగ్జామ్ లో ఊ అంటావా.. ఊహు అంటావా మావా అనే పాట రాస్తానో అనే భయం ఉందిరా అంటూ ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.