Nani: నాచురల్ స్టార్ నాని… అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఈ యంగ్ హీరో. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నానికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి.

నాని నటించిన “వీ”, టాక్ జగదీష్ చిత్రాలు ఓటిటీ లోనే విడుదలయ్యాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే నాని ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా నాని మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “దసరా”. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న… ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ వార్త సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు.

నాని “దసరా” సినిమాలో సమంత గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమంత విడాకుల తర్వాత తెలుగు సినిమాలు ఏ సినిమాకు ఒకే చెప్పకపోవడంతో ఆమె అభిమానులు ఎంతో నిరుత్సాహ పడ్డారు. అయితే సమంత దసరా సినిమాలో కనిపించనుందని తెలియడంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.