Raja Vikramarka: ఆర్ ఎక్స్ 100 తో హీరోగా ఎంట్రీ ఇచ్చి… మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, గుణ 369, 90 ఎమ్ఎల్ వంటి సినిమాలతో అలరించాడు కార్తికేయ. ఆ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేదని చెప్పాలి. మధ్యలో విలన్ గా మారి… ఆ పాత్ర లోనూ సూపర్ అనిపించుకున్నాడు. నాని నటించిన ” గ్యాంగ్ లీడర్ ” సినిమాలో కార్తికేయ నెగిటివ్ క్యారెక్టర్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కార్తీకేయకు ఇప్పుడు హీరో నాని సపోర్టు గా నిలుస్తున్నాడు. కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క చిత్రం ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేయనున్నాడు.

ఈ చిత్రానికి సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించగా… తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించింది. హ్యాపీడేస్ ఫేమ్ సుధాకర్ కోమాకుల మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, 88 రామా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదలవుతుంది. అలాగే తన వంతుగా ఈ మూవీ ప్రమోషన్లలో కూడా నాని పాల్గొనున్నరట. ఈరోజు సాయత్రం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్‌ను నాని విడుదల చేయబోతున్నారు.
అలానే హీరో కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై చిత్రంలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరోకు రాజా విక్రమార్క మూవీ హిట్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.