https://oktelugu.com/

Samantha: కొండా సురేఖ పై మరోసారి స్పందించిన సమంత..మీరు లేకపోతే నేను ఏమైపోయేదానినో అంటూ ఎమోషనల్ కామెంట్స్!

మయోసిటిస్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత, విశ్రాంతి తీసుకునే ముందు ఆమె 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ నవంబర్ 7 వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సమంత తో 'ఫ్యామిలీ మ్యాన్ 2' వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తీసిన రాజ్ & డీకే ఈ సిరీస్ ని తీశారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 17, 2024 / 02:39 PM IST

    Samantha(5)

    Follow us on

    Samantha: మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించి చేసిన కొన్ని అసహ్యకరమైన మాటలు ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సమంత తో పాటు నాగార్జున కుటుంబం కూడా ఆమె వ్యాఖ్యలపై చాలా ఫైర్ అయ్యారు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ వ్యవహారం సమంత కి, అక్కినేని ఫ్యామిలీ కి అండగా నిలబడింది. ఒక ప్రభుత్వం పై సినీ ఇండస్ట్రీ ఇంత ధైర్యం గా మాట్లాడడం ఇది వరకు మనం ఎప్పుడూ చూడలేదు. గతంలో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా సపోర్ట్ కి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ కలిసికట్టుగా స్పందించింది.

    అయితే తనకు వచ్చిన ఈ సపోర్టు కి కృతజ్ఞతగా కాసేపటి క్రితమే సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కొండా సురేఖ గారు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు నా పరువుకు భంగం కలిగించకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. ఈ వివాదం నుండి తొందరగా బయటపడ్డాను అంటే అందుకు కారణం ఇండస్ట్రీ వాళ్ళే. లేకుంటే నేను మానసికంగా చాలా కృంగిపోయేదాన్ని. మీరు చూపించిన ఈ ప్రేమ కారణంగానే నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. గత కొంతకాలం నుండి సమంత సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంది.

    మయోసిటిస్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత, విశ్రాంతి తీసుకునే ముందు ఆమె ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ నవంబర్ 7 వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సమంత తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తీసిన రాజ్ & డీకే ఈ సిరీస్ ని తీశారు. ఇందులో సమంత రా ఏజెంట్ గా కనిపించనుంది. ట్రైలర్ లో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మీరంతా చూసే ఉంటారు. సిరీస్ లో అలాంటి సన్నివేశాలు బోలెడన్ని ఉంటాయి. హాలీవుడ్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వచ్చిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ప్రియాంక చోప్రా క్యారక్టర్ ని సమంత చేయగా, రిచర్డ్ క్యారక్టర్ ని బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ చేసాడు. హాలీవుడ్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ కి మన ఇండియా లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సిరీస్ క్లిక్ అయితే ఇక సమంత క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుంది.