https://oktelugu.com/

Agent Movie : ‘ఏజెంట్’ మూవీ థియేటర్ లో సమంత..అభిమానులతో కలసి కేరింతలు!

ఏజెంట్ సినిమాని నేడు సమంత AMB సినిమాస్ లో అభిమానుల సమక్షం లో చూసిందట.అభిమానుల కేరింతల మధ్య ఆమె కూడా బాగా ఎంజాయ్ చేసిందట,

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2023 / 08:44 PM IST

    agent movie

    Follow us on

    Agent Movie – Samantha : సమంత మరియు నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం కానీ ఇప్పటి వరకు చూడలేదు.నాగ చైతన్య సమంతతో స్నేహపూర్వకంగా ఉండడానికి సిద్ధం గా ఉన్న సమంత మాత్రం లేదనే విషయం రీసెంట్ గా ఎన్నో ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మనకి అర్థం అయ్యింది.విడాకులు తీసుకున్న తర్వాత ఆమె నాగార్జున గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించలేదు,కానీ అక్కినేని అఖిల్ తో మాత్రం ఈమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది.

    ఆయన ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు ప్రతేకంగా తెలియచేస్తుంది, అలాగే సమంత కి ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెట్టిన ఏకైక వ్యక్తి అఖిల్ మాత్రమే.దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య అక్క తమ్ముడి స్థాయి సంబంధం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.ఇక నేడు అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ సినిమా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే.

    భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది,ఫ్యాన్స్ ని కూడా ఈ చిత్రం నిరాశపరిచింది.అయితే ఈ సినిమాని నేడు సమంత AMB సినిమాస్ లో అభిమానుల సమక్షం లో చూసిందట.అభిమానుల కేరింతల మధ్య ఆమె కూడా బాగా ఎంజాయ్ చేసిందట, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    నాగ చైతన్య పుట్టినరోజు కి కనీసం శుభాకాంక్షలు కూడా తెలియచెయ్యని సమంత, అఖిల్ పట్ల మాత్రం ఇంత అభిమానం చూపించడం పై నాగ చైతన్య ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.విడిపోయిన విషయం వాస్తవమే కానీ, మరీ ఇంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముందని , స్నేహం గానే ఉండొచ్చు కదా అని అంటున్నారు.మరి భవిష్యత్తులో అయినా సమంత నాగ చైతన్య తో స్నేహం గా ఉంటుందా లేదా అనేది చూడాలి.