Anasuya – Chalaki Chanti : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీ కి ఎంతోమంది కమెడియన్స్ వచ్చి నేడు గొప్ప స్థానం లో కొనసాగుతున్నారు.వారిలో చలాకి చంటి కూడా ఒకడు, తనదైన కామెడీ టైమింగ్ , మ్యానరిజమ్స్ తో చంటి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం లో దిట్ట.ఈయనలోని టాలెంట్ ని గమినించి మేకర్స్ సినిమాల్లో కూడా అవకాశాలు ఇచ్చారు.
అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన చంటి, ప్రస్తుతం అనారోగ్యానికి గురై ICU లో శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు ఆయనకీ గుండెపోటు వచ్చినట్టుగా నిర్ధారించారు, గుండెలో రక్త నాళాలు స్తంభించడం తో ఆయనకీ గుండెపోటు వచ్చింది, అందుకోసంగా ఆయనకి స్టంట్ వెయ్యడం తో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇక చంటికీ గుండెపోటు వచ్చింది అనే వార్తని తెలుసుకొని జబర్దస్త్ కమెడియన్స్ , టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు చంటిని చూసేందుకు హాస్పిటల్ కి వచ్చి పోతున్నారు.వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు, ఈమె అయితే చంటి గురించి ప్రత్యేకంగా డాక్టర్ల వద్ద ఆరాలు తీసి, ఎలాంటి అవసరం వచ్చినా తనకి కాల్ చేయాల్సిందిగా చెప్పిందట.ఎవరికీ లేనిది ఈమెకి ఎందుకు చంటి అంత స్పెషల్ అంటే, జబర్దస్త్ షో సమయం లో వీళ్లిద్దరి మధ్య అన్న చెల్లెలు లాంటి అనుబంధం ఏర్పడింది అట.
అనసూయ జబర్దస్త్ షో ని వదిలి వెళ్తున్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చినా వ్యక్తి చలాకి చంటినే, నెలలో కనీసం రెండు మూడు ఎపిసోడ్ అయినా చెయ్యి అని అనసూయ ని అడగగా, ఆమె కనీళ్ళు పెట్టుకుంటూనే కుదరదు అని సమాధానం ఇచ్చింది.వీళ్లిద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండ్ ఉండడం వల్లే, చంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే విషయం తెలియగానే ఏడ్చేసిందట అనసూయ.