https://oktelugu.com/

Ponniyan Selvan 2 Collections : ‘పొన్నియన్ సెల్వన్ 2’ మొదటి రోజు వసూళ్లు..ఊహించిన దానికంటే ఎక్కువ రాబట్టిందిగా!

ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ చిత్రం,

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2023 / 08:33 PM IST
    Follow us on

    Ponniyan Selvan 2 Collections : తమిళ సినిమా ఇండస్ట్రీ కి బాహుబలి లాంటి చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’.చోళులను తమిళియన్ల దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తారు, ఇది వరకు ఎన్నో కథలు చోళుల మీద వచ్చాయి కానీ, మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ – 1’ గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి ని సృష్టించింది.ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.మొదటి రోజు ఈ చిత్రానికి అన్నీ భాషలకు కలిపి సుమారుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.రజనీకాంత్ సినిమాల తర్వాత అంతటి వసూళ్లు ఈ చిత్రానికే వచ్చింది, కానీ పొన్నియన్ సెల్వన్ – 2 కి మాత్రం ఆ స్థాయి వసూళ్లు రాలేదు.ఒకసారి మొదటి రోజు ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టబోతుందో ఇప్పుడు మనం చూద్దాము.

    పొన్నియన్ సెల్వన్ – 2 కి ఎందుకో మొదటి నుండి పార్ట్ 1 కి ఉన్నంత క్రేజ్ మరియు హైప్ లేదు, అందువల్ల అడ్వాన్స్ బుకింగ్స్ చాలా యావరేజి గా ఉన్నాయి, తమిళనాడు లో కూడా ఆశించిన స్థాయిలో లేవు.దీనితో ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల లోపే మొదటి రోజు గ్రాస్ వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నారు.కానీ మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ రావడం తో ప్రతీ షో కి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి.

    ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో పార్ట్ 1 వసూళ్లను దాటుతుందో లేదో చూడాలి.ఈమధ్య టాక్ వస్తున్న సినిమాలకు వసూళ్లు ఆగడం లేదు, పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 కి అద్భుతమైన టాక్ వచ్చింది, మరి దీని రేంజ్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.