https://oktelugu.com/

Samantha: చైతుతో ఉన్న ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్…

Samantha: మోస్ట్ క్రేజీ కపుల్​గా ఉండే సమంత -నాగచైతన్య వివాహ బంధానికి అక్టోబర్ 2న తెరపడిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయిన విషయాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సమంత తన ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి తీర్థయాత్రలకు వెళుతుండగా చైతూ మాత్రం ఎక్కడ కనిపించటం లేదు. భర్తతో విడాకుల అనంతరం సమంత ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 03:55 PM IST
    Follow us on

    Samantha: మోస్ట్ క్రేజీ కపుల్​గా ఉండే సమంత -నాగచైతన్య వివాహ బంధానికి అక్టోబర్ 2న తెరపడిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయిన విషయాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సమంత తన ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి తీర్థయాత్రలకు వెళుతుండగా చైతూ మాత్రం ఎక్కడ కనిపించటం లేదు.

    భర్తతో విడాకుల అనంతరం సమంత ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. అయితే విడాకుల తరువాత కూడా సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనపై వస్తున్న రూమర్స్ కు కౌంటర్ ఇస్తూనే తనకు సంబంధించిన ఫోటోలను, తన విషయాలు అన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది. అయితే తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలు అన్నింటినీ తొలగించేసింది. దాదాపు చైతో కలిసి ఉన్న 85 ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి సామ్ తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇకపై చైతో తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేసి జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నట్టుంది సామ్.

    అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య తమ తమ సోషల్ మీడియాల ద్వారా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరి విడాకుల విషయం చర్చల్లోనే ఉంది. కొంతమందైతే ఏకంగా సమంత పిల్లలు వద్దని అనుకుందని, ఇంకెవరితోనో సన్నిహితంగా ఉందని, అందుకే చైతన్య ఆమెతో విడిపోయాడు అంటూ నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు. అయితే వాళ్లందరికీ సోషల్ మీడియా ద్వారానే కౌంటర్ ఇచ్చింది సామ్.