కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతుల ఖాతాలలో 6,000 రూపాయలకు పైగా జమ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా సగం ధరకే ట్రాక్టర్ ను కొనుగోలు చేయవచ్చని ఒక వార్త వైరల్ అవుతోంది.
మిగతా సగం డబ్బును కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని కూడా వినియోగించుకుని మరింత తక్కువ ధరకే ట్రాక్టర్ ను పొందవచ్చు. ఒక రైతు కేవలం ఒక ట్రాక్టర్ ను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కిసాన్ ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్, బ్యాంక్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉంటే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సమీపంలోని సీఎస్సీ కేంద్రంను సందర్శించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొత్తగా ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలని భావించే రైతులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తలో నిజం లేదని వెల్లడించింది.