ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. https://www.joinindiannavy.gov.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 2002 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2005 సంవత్సరం మార్చి 31వ తేదీ మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలంలో నెలకు 14,600 రూపాయలు వేతనంగా లభించనుందని తెలుస్తోంది.
శిక్షణ పూర్తైన తర్వాత నెలకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కోర్సు ప్రారంభం కానుండగా శిక్షణ వ్యవధి మూడు నెలలుగా ఉండనుంది. 2021 సంవత్సరం అక్టోబర్ నెల 29వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా నవంబర్ 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.