https://oktelugu.com/

బాలయ్య కోసం సితార ఎమోషనల్ డ్రామా !

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త సినిమా చేయడానికి సితార సంస్థ సన్నాహాలు చేసుకుంటుంది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ సినిమా వల్ల టాలీవుడ్ లో మంచి క్రెడిబులిటీ సితార సంస్థకి దక్కింది. అందుకే మళ్ళీ అలాంటి ఎమోషనల్ డ్రామాను కొత్త నేపథ్యంలో చేయాలని సితార సంస్థ ప్లాన్ లో ఉంది. ఎలాగూ జెర్సీ సినిమాను దిల్ రాజు భాగస్వామ్యంతో హిందీలో కూడా నిర్మిస్తోంది. ఇప్పుడు మరో ఎమోషనల్ క్లాసిక్ తీసేందుకు హీరోని ఒప్పించే పనిలో పడింది. […]

Written By:
  • admin
  • , Updated On : May 24, 2021 / 04:41 PM IST
    Follow us on

    పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త సినిమా చేయడానికి సితార సంస్థ సన్నాహాలు చేసుకుంటుంది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ సినిమా వల్ల టాలీవుడ్ లో మంచి క్రెడిబులిటీ సితార సంస్థకి దక్కింది. అందుకే మళ్ళీ అలాంటి ఎమోషనల్ డ్రామాను కొత్త నేపథ్యంలో చేయాలని సితార సంస్థ ప్లాన్ లో ఉంది. ఎలాగూ జెర్సీ సినిమాను దిల్ రాజు భాగస్వామ్యంతో హిందీలో కూడా నిర్మిస్తోంది.

    ఇప్పుడు మరో ఎమోషనల్ క్లాసిక్ తీసేందుకు హీరోని ఒప్పించే పనిలో పడింది. అన్నట్టు ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేస్తోంది దర్శకుడు వెంకీ అట్లూరి. రంగ్ దే అంటూ రొటీన్ కొట్టుడు లవ్ స్టోరీ తీసి విసిగించిన వెంకీ నుండి గొప్ప ఎమోషనల్ డ్రామా అంటే.. అదీ క్లాసిక్ అంటే మరి ఎంతవరకు నమ్మవచ్చు అనేది సితారకే తెలియాలి.

    ఏది ఏమైనా వెంకీ అట్లూరి సితార సంస్థ ఆస్థాన డైరక్టర్ గా మారిపోయాడు. రంగ్ దే లాంటి ప్లాప్ సినిమా ఇచ్చినా.. సితార కంపౌండ్ లో ఇంకా వెంకీకి ప్రత్యేక స్థానం ఉండటం నిజంగా విశేషమే. మరోపక్క బాలయ్యకు సరిపడా కథను వండే ప్రయత్నాల్లో కూడా ఉంది ఈ నిర్మాణ సంస్థ.

    బాలయ్య కోసం కథ ఎవరి చేత రాయిస్తోందో గానీ, బాలయ్యతో సినిమా చేయడానికి మాత్రం సితార ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తోంది. కానీ బాలయ్య మాత్రం ఈ సంస్థతో సినిమా చేస్తానంటూనే సంవత్సరాలు గడిపేస్తున్నాడు. సో.. వెంకీ రాసే ఎమోషనల్ డ్రామాలో బాలయ్యను పెట్టాలనే ఆలోచన ఉంది సితారకి. మరి ఏమవుతుందో చూడాలి.