Sree Vishnu Vishnu Vinyasam 10 days collections : శ్రీ విష్ణు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం ‘ విడుదలై 10 రోజులు పూర్తి అయ్యింది. ఈ సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత యూత్ ఆడియన్స్ ఈ సినిమాని ప్రోత్సహించారు. ఫలితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చింది. రెండవ వీకెండ్ లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలా బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చింది ?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు వివరంగా ఒకసారి చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 10 వ రోజున బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా పది రోజులకు కలిపి చూస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 10 లక్షల రూపాయిలు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 10 రోజులకు తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి మరో కోటి 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 7 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి 8 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకో కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా ఆ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే శ్రీవిష్ణు కెరీర్ లో మరో క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. టాక్ కాస్త డివైడ్ గా వచినప్పయికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడాన్ని చూస్తుంటే శ్రీ విష్ణు కి యూత్ ఆడియన్స్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం అవుతుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.