Anushka-Samantha : ఎన్నో సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన అభిమానులకు ఆనందాన్ని తెప్పించింది అనుష్క శెట్టి. దాదాపు భాగమతి చిత్రం తరువాత హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్ లో స్క్రీన్ పైన అనుష్క కనిపించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి .. అప్పట్లో సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్య సినిమా తీసిన దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాలో కథ దాదాపు అనుష్క చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అనుష్క ఎన్నో సంవత్సరాల తరువాత స్క్రీన్ పైన కనిపించడంతో రాజమౌళి దగ్గర నుంచి సమంతా వరకు ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్న రాజమౌళి స్వీటీ భలే చేసింది అని పోస్ట్ పెట్టగా ఇప్పుడు సమంతా కూడా అనుష్కని పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టేసింది.
సమంత ఈ మధ్య వరకు తన ఖుషి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఆ తరువాత యూఎస్ కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్‌లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చూసిన సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇటీవల కాలంలో ఏ సినిమా తనను ఇంతగా నవ్వించలేదని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వలేదు. థాంక్యూ నవీన్ పొలిశెట్టి. నువ్వు మామూలు జెమ్ కాదు. చిత్ర బృందానికి, ఎప్పుడూ మనోహరంగా ఉండే అనుష్కకు అభినందనలు’ అని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పారు. ఈ స్టోరీకి నవీన్ పొలిశెట్టి స్పందించారు. ‘ఓరి దేవుడా.. ఇండియాలోని ఉత్తమమైన నటీమణుల్లో ఒకరైన సమంతను మేం నవ్వించడం మా అదృష్టం. థాంక్యూ సో మచ్’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నవీన్ పేర్కొన్నారు. ఈ స్టోరీని సమంత తన స్టోరీలో పోస్ట్ చేశారు.
ఇక తనకు ఖుషి సినిమా థియేటర్స్ లో ఆడతా ఉండగానే మరోపక్క విడుదలైన అనుష్క సినిమాని కూడా సమంత ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడంతో.. అనుష్క అభిమానులు అలానే సమంత అభిమానులు సమంతా ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.