Jawan Movie Collections : స్వదేశంలో.. విదేశంలో రికార్డు సాధిస్తున్న జవాన్.

తొలిరోజు భారత్ బాక్సాఫీసు వద్ద రూ.74 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. రెండో రోజు రూ.53 కోట్ల నెట్ రాబట్టింది.

Written By: Swathi Chilukuri, Updated On : September 10, 2023 2:16 pm

Jawan Movie

Follow us on

Jawan Movie Collections : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించి మెప్పించిన చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ వహించిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పడుకొనే, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో కనిపించారు.

ఇక మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ సినిమా చరిత్రలోనే తొలిరోజు అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా రెండో రోజు శుక్రవారం కూడా బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపింది. ఇండియాలో అలానే విదేశాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది జవాన్.

ముఖ్యంగా ఇండియాలో రెండో రోజు రూ.53 కోట్ల నెట్ వసూలు చేసిందట. ఇది షారుఖ్ ఖాన్ గత చిత్రం ‘పఠాన్’ ఓపెనింగ్ డే కలెక్షన్‌తో ఇంచుమించుగా సమానమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తొలిరోజు భారత్ బాక్సాఫీసు వద్ద రూ.74 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. రెండో రోజు రూ.53 కోట్ల నెట్ రాబట్టింది. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే అనేక భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ ద్వారానే ఇండియన్ బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో రూ.47 కోట్ల నెట్ వసూలైనట్టు సమాచారం.

మరోపక్క మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘జవాన్’.. రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రెండో రోజు రూ.107 కోట్ల గ్రాస్‌తో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ‘జవాన్’ గ్రాస్ కలెక్షన్ రూ.236 కోట్లకు చేరింది. ఇక ఇండియా విషయానికి వస్తే.. రెండు రోజుల్లో ‘జవాన్’ వసూలు చేసిన నెట్ కలెక్షన్ రూ.127 కోట్లుగా ఉంది.

ఇక యూకేలో మొదటిరోజు ఈ సినిమా 306,793 పౌండ్లు వసూలు చేయగా.. రెండో రోజు 312,166 పౌండ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అంటే మొత్తం రెండు రోజుల కలెక్షన్ 618,959 పౌండ్లు. ఇక ఆస్ట్రేలియాలో ‘జవాన్’ రెండు రోజుల్లో రూ.4.77 కోట్లు వసూలు చెయ్యగా, న్యూజిలాండ్‌లో రెండు రోజుల్లో రూ.96.06 లక్షలు, జర్మనీలో రూ.2.64 కోట్లు వసూలు చేసింది.

మొత్తానికి స్వదేశంలో అలానే విదేశంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా.