Salman Khan
Salman Khan : బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకు ప్రస్తుతం సరైన సక్సెస్ అయితే రావడం లేదు. చిన్నచితక హీరోలు మంచి విజయాలు అందుకుంటున్నప్పటికి ఖాన్ త్రయం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అమీర్ ఖాన్(Ameer Khan), షారుక్ ఖాన్(Sharukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan)లాంటి హీరోలు మాత్రం భారీ విజయాలను అందుకోవడంలో తడబడుతున్నారు. కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వీళ్ళందరూ మునపటి మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో చాలావరకు డీలపడిపోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ అయితే సక్సెస్ ఫుల్ సినిమాను అందించి చాలా రోజులవుతుంది. వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా మురుగదాస్ (Murugadas) దర్శకత్వంలో చేసిన సికిందర్ (Sikindar) సినిమాతో భారీగా డీలా పడ్డాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కుతాను అని అనుకున్నప్పటికి అది కూడా బెడిసి కొట్టింది. సినిమా మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను కూడా తల కిందులు చేస్తూ ఈ సినిమా ఏ మాత్రం తన మ్యాజిక్ ని చూపించకపోవడంతో సల్మాన్ ఖాతాలో మరొక డిజాస్టర్ యాడ్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న సందర్భంలో ఇతర భాషల స్టార్ హీరోలందరు మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యం తో సల్మాన్ ఖాన్ సైతం తెలుగు దర్శకుల మీద ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఖాన్ త్రయం పరువు పోతుందా..? వాళ్లు సక్సెస్ లు కొట్టలేకపోవడానికి కారణం ఏంటి..?
ప్రస్తుతం తెలుగులో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ (Harish Shankar) కమర్షియల్ సినిమాలను చేయడంలో దిట్ట…కాబట్టి సల్మాన్ ఖాన్ తో ఒక భారీ కమర్షియల్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది తద్వారా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. హరీష్ శంకర్ ఇంతకుముందు రవితేజతో మిస్టర్ బచ్చన్ (Mistar Bachhan) సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagath Sing) సినిమా కూడా సెట్స్ మీదనే ఉంది. మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : హరీష్ శంకర్ దర్శకత్వం లో సల్మాన్ ఖాన్..ఆ తెలుగు సినిమాని రీమేక్?