Hardik Pandya : ప్రస్తుతం ఇదే పరిస్థితిని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం రాత్రి లక్నో జట్టుతో (LSG vs MI) జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తీసుకొన్న నిర్ణయం అతడిని సోషల్ మీడియాలో విమర్శల పాలు చేస్తోంది.. ముంబై జట్టు విజయానికి చివరి ఓవర్ లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఆ దశలో బౌలింగ్ చేయడానికి లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేష్ ఖాన్ ను రంగంలోకి దింపాడు. ఆ ఓవర్ కంటే ముందు తిలక్ వర్మను హార్దిక్ పాండ్యా రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించాడు. అతడి స్థానంలో శాంట్నర్ ను బ్యాటింగ్ కు రావాలని కోరాడు. దీంతో కెప్టెన్ మాట కాదనలేక తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. హార్దిక్ సూచనల మేరకు శాంట్నర్ వచ్చాడు.. అతడురెండు బంతులు ఎదుర్కొని.. రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక చివరి ఓవర్ కట్టుదిట్టంగా వేసిన ఆవేశ్ ఖాన్ పదిపరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : సరికొత్త చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా..
హార్దిక్ పాండ్యాపై నిప్పులు
తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించడంపై మాజీ క్రికెటర్.. క్రికెట్ అభిమానులు ముంబై యాజమాన్యంపై.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ చర్య అతడిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..” తిలక్ వర్మ గొప్ప ఆటగాడు. అతడి ఆత్మాభిమానం దెబ్బ తినే విధంగా ముంబై జట్టు యాజమాన్యం, ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించారు. ఇది సరైన పద్ధతి కాదు. తిలక్ వర్మ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్స్ లు కొట్టాడు.. అసలు హార్థిక్ పాండ్యా చివరి ఓవర్ లో శాంట్నర్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. ఎందుకు రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోలేదు.. గేమ్ ప్లాన్ అంటే ప్రత్యర్థి జట్టుపై గెలిచే విధంగా ఉండాలి. కష్టకాలంలో ప్రత్యర్థి జట్టుపై పై చేయి సాధించే విధంగా ఉండాలి. అలాకాకుండా తోటి ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. అసలు జట్టు విజయానికి దగ్గర్లో ఉన్నప్పుడు.. విజయం సాధించాలి అనుకున్నప్పుడు.. కసిగా ఆడితే సరిపోతుంది కదా.. అలాకాకుండా ఎంతో వేగంగా బ్యాటింగ్ చేసే ఆటగాడిని అలా పంపించడం ఎందుకు.. ఇలాంటి పరిణామం జట్టుకు మేలు ఎలా చేస్తుంది.. ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ” సీనియర్ ఆటగాళ్లు.. తిలక్ వర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ యాజమాన్యం, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిణామం జట్టుకు ఏమాత్రం మంచి చేయదని వారు హితవు పలుకుతున్నారు.
Also Read : రోహిత్ శర్మ.. తిలక్ వర్మ ఏం చేశారు? హార్దిక్ పాండ్యాకు బుర్ర పని చేస్తోందా?