Atrangi Re: సినిమా ఎంత బాగా తీసినా.. టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ వ్యవహారంలోనే పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో చాలా సార్లు టైటిల్ విషయంలో కొంత మంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడటం మనం చూశాం. అందులో కొంత మంది సర్దుకుపోతుంటే.. మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు.
salman-khan-condition-to-atrangi-re-movie-title
అయితే, బాలీవుడ్ సినిమా అత్రంగీరే ప్రస్తుతం ఈ విషయంపై చర్చలోకి వచ్చింది. ఈ సినిమాపై తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ దర్శకుడు ఆనందర్ ఎల్ రాయ్‌కు షరతులు విధించాడట. ఈ విషయాన్ని ఆ దర్శకుడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: ధోనీతో బ్రేకప్‌పై నటి లక్ష్మీ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆనంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెరకెక్కిన రెండు సినిమాలు రక్షా బంధన్, అంత్రంగి రే.. టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించడానికి ఫిల్మ్ అసోషియేషన్ వద్దకు వెళ్లారట. అయితే, అప్పటికే ఆత్రంగి రే టైటిల్‌ను సల్మాన్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారట . టైటిల్ కోసం సల్మాన్‌కు కలవగా ఆయన ఓ షరతు పెట్టారట.. ఈ సినిమాను ఆనంద్ దర్శకత్వం వహిస్తేనే టైటిల్ ఇస్తానని అన్నారట. లేదంటే ఆ టైటిల్‌ను వదిలే ప్రసక్తే లేదని సల్మాన్ చెప్పినట్లు సమాచారం. ఆ అంగీకారం ప్రకారమే ఆయనే ఈ సినిమాను తెరకెక్కించారు.
కాగా, ఆనందర్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిసిన సినిమా ఆత్రంగి రే సినిమాలో సారా అలీఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీని చూపించబోతున్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: హైదరాబాద్‌కు దీపికా.. ప్రభాస్ సినిమా షూటింగ్ కోసమేనట?