Subhalagnam: ‘శుభలగ్నం’.. తెలుగు సినీ చరిత్రలో ఓ చెరగని శిల్పం లాంటి మూవీ. ఆలుమగల మధ్యన అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చూపించిన తీరుకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి కాసులు కురిపించింది. జగపతిబాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటిగా చెప్పొచ్చు.

జగపతిబాబు భార్య బాధితుడిగా అమాయకుడిగా నటించి మెప్పించాడు. ఇక అత్యాశలకు పోయి భర్తను కోటి రూపాయాలకు అమ్మేసిన భార్యగా ఆమని నటన ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. తర్వాత తన తప్పును తెలుసుకొని డబ్బు కన్నా మొగుడే ముఖ్యం అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యే పాత్రలో ఆమని నట విశ్వరూపం ప్రదర్శించింది..
ఇక ఈ సినిమాలో రోజా పాత్ర ప్రముఖమైనది. లంచాలు తీసుకోకుండా నిజాయితీగా ఉండే మధ్యతరగతి పెళ్లైన ఉద్యోగిని ప్రేమించి కోటి రూపాయలకు కొని తర్వాత సాదాసీదా అమ్మాయిగా మారిన రోజా నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.

ఈ మూడు పాత్రలతోనే సినిమాను రక్తకట్టించి హిట్ కొట్టించిన ఘనత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సొంతం. అప్పట్లో దర్శకులు అందరూ ప్రేమకథలపై సినిమాలు తీస్తే మన కృష్ణారెడ్డి మాత్రం ఈ విడాకుల గురించి తీసి సమాజానికి కనువిప్పు కలిగించి ఆడవారి అహాన్ని అద్భుతంగా చూపించి కుటుంబాలను నిలబెట్టాడని ప్రశంసలు కురిశాయి.
అందుకే ‘శుభలగ్నం’ మూవీ అప్పట్లో సంచలన హిట్ గా నిలిచింది. కుటుంబ కథా చిత్రాల్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

తాజాగా ఇంతటి అద్భుతమైన సినిమా తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అసలు ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించిందో ఆ కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. అది విని అందరూ షాక్ అయ్యారు.
Also Read: Pushpa: పుష్ప మేకర్స్ చేసిన ఆ తప్పుకు.. చెల్లించక తప్పదు భారీ మూల్యం?
‘అవసరానికి మించి అత్యధిక డబ్బులు సంపాదించాలనే ఆలోచన వస్తే.. ఆ ఆశ విపరీతంగా పెరిగిపోతే భార్యభర్తల మధ్య వచ్చే సమస్యలు ఇలా ఉంటాయని అందరికీ చూపించడానికి ఈ సినిమాను తీశానని’ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ఇది కళ్లారా చూశానని అందుకే తీశానన్నారు.
Also Read: Bheemla Nayak Movie: “భీమ్లా నాయక్” నుంచి అడవి తల్లి సాంగ్ రిలీజ్…