Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్‌ను బెదిరించి రూ.5 కోట్లను డిమాండ్ చేసిన నిందితుడిని ముంబై పోలీసుల బృందం జంషెడ్‌పూర్‌కు చెందిన అరెస్టు చేసింది. ముంబైలోని వర్లీ పోలీసులు అతడిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో అరెస్టు చేశారు. గత వారం ముంబై ట్రాఫిక్ పోలీసులకు సల్మాన్‌కు సంబంధించి బెదిరింపు మెసేజ్ వచ్చింది. అందులో రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జంషెడ్‌పూర్ స్థానిక పోలీసుల సహాయంతో మెసేజ్ పంపిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముంబై పోలీసులు మాట్లాడుతూ, “జంషెడ్‌పూర్‌లో స్థానిక పోలీసుల సహాయంతో దర్యాప్తు నిర్వహించి..బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పుడు అతన్ని ముంబైకి తీసుకువస్తాం’’ అని అన్నారు.
అక్టోబర్ 18న బెదిరింపులు
ముంబై పోలీసులు అరెస్టు చేసిన నిందితులు అక్టోబర్ 21న క్షమాపణలు కూడా మెయిల్ ద్వారా పంపారు. ఇందులో అక్టోబర్ 18న సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్ గురించి మాట్లాడాడు. బెదిరింపు మెసేజ్ పొరపాటున పంపినట్లు అతడు చెప్పుకొచ్చాడు.” అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు మొదటి బెదిరింపు మెసేజ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ముంబై ట్రాఫిక్ పోలీసులకు అదే నంబర్ నుండి మరో మెసేజ్ వచ్చింది. దీనిలో బెదిరింపులు చేసిన వ్యక్తి క్షమాపణలు కోరాడు. మెసేజ్ పొరపాటున పంపబడిందని పేర్కొన్నారు.
లారెన్స్‌కి సన్నిహితుడనని చెబుతూ రూ.5 కోట్లు డిమాండ్
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపు సందేశం పంపిన వ్యక్తి లొకేషన్ జార్ఖండ్‌లో దొరికింది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహితంగా ఉన్నానని, తనకు విమోచన డబ్బు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తానని చెప్పాడు. సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే, లారెన్స్ బిష్ణోయ్‌తో తన శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలనుకుంటే, అతను 5 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రాసుకొచ్చాడు. డబ్బులు ఇవ్వకుంటే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా తయారవుతుందని హెచ్చరించాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు జార్ఖండ్‌లో ఆ నంబర్‌ను ట్రాక్ చేశారు. నిందితుడు జంషెడ్‌పూర్‌లో కూరగాయలు అమ్మేవాడని పోలీసులు తెలుసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడిని షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌గా గుర్తించారు. నిందితుడి వయస్సు 24 ఏళ్లు, జంషెడ్‌పూర్‌లో కూరగాయలు విక్రయిస్తుంటాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారని దీనికి ఒకరోజు ముందు అధికారులు చెప్పారు. సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన కుట్రను కొన్ని నెలల క్రితం నవీ ముంబై పోలీసులు బయటపెట్టారు. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. కొద్ది రోజుల క్రితం బాబా సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్చారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు కూడా వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Salman khan the vegetable merchant who demanded rs 5 crore from salman khan is this the real story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com