Salaar Collections : సలార్ కలెక్షన్స్.. మరో అరుదైన ఫీట్ సాధించిన ప్రభాస్

ప్రభాస్ ఖాతాలో మూడు రూ. 500 కోట్ల చిత్రాలు ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2, సలార్ ఐదు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. న్యూ ఇయర్ వరకు సలార్ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంది

Written By: NARESH, Updated On : December 28, 2023 9:31 pm
Follow us on

Salaar Collections : సలార్ తో కొన్ని అరుదైన రికార్డులు ప్రభాస్ సొంతం అవుతున్నాయి. ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైన్స్ కి ప్రభాస్ పెట్టింది పేరు. ఫ్యాన్స్ ఆశించే ఈ యాంగిల్ ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో తగ్గింది. ఈ క్రమంలో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అనగానే అంచనాలు ఆకాశానికి చేరాయి. ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రియులు సలార్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ సలార్ విడుదలైంది. ఫస్ట్ డే సలార్ రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. 2023కి గాను అత్యధిక ఓపెనింగ్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. క్రిస్మస్ వరకు సలార్ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. వర్కింగ్ డేస్ మొదలయ్యాక నెమ్మదించాయి. ఇక ఆరు రోజులకు సలార్ రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

ప్రభాస్ ఖాతాలో మూడు రూ. 500 కోట్ల చిత్రాలు ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2, సలార్ ఐదు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. న్యూ ఇయర్ వరకు సలార్ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే సలార్ బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా రూ. 100 కోట్ల వరకు రాబట్టాలి. అప్పుడే లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. క్లీన్ హిట్ కొడుతుంది.

సలార్ చిత్రానికి సీక్వెల్ ఉంది. ప్రశాంత్ నీల్ కథ మొత్తం పార్ట్ 2 కోసం దాచేశాడనే వాదన ఉంది. అందుకే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయినా కానీ… ఎమోషనల్ గా సినిమా కనెక్ట్ కాలేదనే వాదన వినిపిస్తుంది. సలార్ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేశారు. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటించింది. జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబీ సింహ కీలక రోల్స్ చేశారు.