నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ‘రాధే శ్యామ్’ షూటింగ్ తో ఇప్పటివరకు తీరిక లేకుండా గడిపిన ప్రభాస్, ఆ సినిమాని పూర్తి చేశాడు. అందుకే, వచ్చే వారం సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయడానికి ప్రస్తుతం కసరత్తులు మొదలుపెట్టాడు. అన్నట్టు మూడు వారాల పాటు ‘సలార్’ షెడ్యూల్ జరగనుంది.
ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందట. అందుకే ‘సలార్’ విలన్ డెన్ కోసం ప్రస్తుతం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను నిర్మించే పనిలో ఉంది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. పైగా ప్రభాస్ పై ఈ సీన్స్ షూట్ చేస్తారట. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ప్రశాంత్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణాన్ని తీసుకుంటున్నాడు.
ఇప్పటికే ‘సలార్’ సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటిస్తోంది. జ్యోతిక ప్రభాస్ కి అక్కగా నటిస్తోందట. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, మేకర్స్ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి అనుకున్న డేట్ కి ఈ సినిమాని రిలీజ్ చేస్తారా ? డౌటే.