Homeటాప్ స్టోరీస్Sugar Mom Culture In Hyderabad: షుగర్ డాడి లే కాదు.. షుగర్ మమ్మీలు కూడా...

Sugar Mom Culture In Hyderabad: షుగర్ డాడి లే కాదు.. షుగర్ మమ్మీలు కూడా ఉన్నారు..

Sugar Mom Culture In Hyderabad: ఒక మనిషి ప్రకృతి సిద్ధంగా నడుచుకుంటే అన్ని బాగానే ఉంటాయి. విధానాలపరంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉంటాయి. అదే మనిషి డబ్బు మాయలో పడి.. స్టేటస్ సింబల్ మాయలో పడి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే.. ఆ తర్వాత అన్ని ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.

డబ్బు అనేది మనిషిని ఆడిస్తూ ఉంటుంది. అవసరాలనేవి మనిషివిని మరోవైపు నడిచేలా చేస్తాయి. డబ్బు లేకుండా మనిషి జీవించలేడు. అవసరాలు తీరకుండా మనుగడ సాగించలేడు. డబ్బు అనేది కొంతమందికి ప్రాధాన్యమైన అవసరమైతే.. మరికొందరికి జీవితం. ప్రాధాన్యమైన అవసరం లాగా డబ్బులు భావించేవారు జీవితాన్ని సుఖవంతంగా సాగిస్తుంటారు. కానీ జీవితమే అనుకునే వారు మాత్రం డబ్బు చుట్టూ పరిభ్రమిస్తుంటారు.

డబ్బు చుట్టూ పరిభ్రమించడం మొదలైతే ఆ తర్వాత మనిషి తన ఆకృతిని.. తన అలవాట్లను.. తన వ్యవహారాలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. డబ్బు కోసం “మనీ”షిగా మారాల్సి ఉంటుంది. డబ్బు అనేది మనిషిని ఆడించిన తర్వాత.. మనిషి చాలా వాటికి దూరమవుతూ ఉంటాడు. అందులో సంసార జీవితం కూడా ఉంటుంది.

డబ్బు, కెరియర్, ఆస్తుల సంపాదన వ్యవహారాలు మనిషిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్న నేపథ్యంలో చాలామంది 30 సంవత్సరాలు దాటేవరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. గతంలో ఈ జాబితాలో పురుషులు ఉండేవారు. ఇప్పుడు మహిళలు కూడా చేరిపోయారు.

పురుషులలో రిచ్ డాడిస్ అనేవారు విపరీతమైన కరువులో ఉంటారు. సో కాల్డ్ రిచ్ షుగర్ డాడీస్ 40 నుంచి 50 సంవత్సరాలు వచ్చేదాకా పనిచేస్తూనే ఉంటారు. కెరియర్ కోసం కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడో వారి వయసులో 15 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కోరికలు మొదలవుతాయి. కనీసం 30 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉండదు. వివాహం తర్వాత కోరికలు తీసుకోవడానికి సమయం ఉండదు. జుట్టు తెల్లగా అయ్యేవరకు సంపాదనలోనే అసలు కాలం కాస్త పూర్తవుతుంది. అప్పటికి వయసు అయిపోతుంది. శరీరానికి షుగర్ అనేది తగిలిన తర్వాత.. ఆ డాడి లకు షుగర్ బిడ్డలు తగులుతుంటారు. అందుకే షుగర్ కావాలని శరీరం కోరుతూ ఉంటుంది. వివాహం చేసుకొని డాడీలు అవ్వకుండా.. వయసు పెరిగిన తర్వాత షుగర్ కోసం తాపత్రయపడుతుంటారు. ఇక్కడ ఈ షుగర్ దాడిలతో వ్యవహారం సాగించేవారు కూడా అదే సమస్యతో ఉంటారు.

షుగర్ డాడి ల గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు షుగర్ మమ్మిల గురించి కూడా మాట్లాడుకోవాలి. పైన చెప్పిందే వీరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేటి కాలంలో ఆకాశంలో సగం.. అన్నిట్లోనూ సగం అని మహిళలు గట్టి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కెరియర్లో స్థిరపడిన తర్వాత అన్నీ అనుకుంటున్నారు. కానీ అప్పటికే సగం వయసు దాటిపోతుంది. ఇక అప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా చాలామందిలో చచ్చిపోతోంది. ఫలితంగా వారు షుగర్ మమ్మీలుగా మారిపోతున్నారు. దేహం పోరు పెట్టినప్పుడు.. తప్పదు కాబట్టి వారు అదేదారిలో వెళ్తున్నారు. ఇది నైతికమా? అనైతికమా? అనే ప్రశ్నలకు ఆస్కారం లేని వ్యవహారం.

దాహం వేస్తే నీళ్లు తాగుతాం. ఆకలి వేస్తే ఆహారం తింటాం. నిద్ర వస్తే పడుకుంటాం. దేహంలో సెగలు రగిలితే.. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో నీతికి.. ఇతర సిద్ధాంతాలకు తావులేదు.

షుగర్ డాడి అనేది వెస్ట్రన్ కల్చర్. షుగర్ మమ్మి కూడా అదే బాపతు. కాకపోతే ఈ కల్చర్ మన హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఇప్పుడు కనిపిస్తోంది. వీటికోసం కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. కాకపోతే అవి బయటపడవు. షుగర్ డాడిల కంటే షుగర్ మమ్మిలే భారీగా ఖర్చు పెడతారట. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు.. ఈ వ్యవహారం సాగిస్తున్న కొన్ని సంస్థలు చెబుతున్న నగ్న సత్యాలు. ఇంకా లోతుగా ఈ సబ్జెక్టు గురించి చెప్పొచ్చు. కాకపోతే అదంతా సెన్సార్ లో ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version