Pawan Kalyan And Surender Reddy: పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో త్వరలోనే తెరకెక్కబోతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో రోజుకి ఒక అప్డేట్ వస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతుందని, అంతే కాకుండా ఈ చిత్రం అన్నదమ్ముల నేపథ్యంలో లో సాగుతుందని, పవన్ కళ్యాణ్ సోదరుడిగా మరో పాపులర్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో నటించే సెకండ్ హీరో రోల్ పై అనేక రూమర్స్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. అనేకమంది విజయ్ దేవరకొండ రెండవ హీరో గా నటిస్తాడని సోషల్ మీడియా లో ప్రచారం చేశారు.
ఇప్పుడు లేటెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రవితేజ తో గతంలో సురేందర్ రెడ్డి కిక్ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి నుండి సురేందర్ రెడ్డి కి రవితేజ వ్యక్తిగతంగా మంచి సన్నిహితుడు అయ్యాడు కాబట్టి సురేందర్ రెడ్డి అడగగానే ఒప్పుకునే అవకాశం ఉంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా స్పష్టమైన క్లారిటీ కి రాలేదు. కచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 19 న ఉగాది పర్వదినం రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది.
నిన్ననే మంగళగిరి లో పవన్ కళ్యాణ్ ని కలిసి ఫైనల్ స్క్రిప్ట్ న్యారేషన్ ఇచ్చారట. జూన్ నుండి నాన్ స్థాప్ గా 4 నెలలు డేట్స్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం హీరోయిన్ రోల్ కోసం ‘ఫౌజీ’ ఫేమ్ ఇమాన్వి ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 15 న ఈ సినిమాలోని రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ రానుంది.