అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మోకాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే అక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మోకాలు ఫ్రాక్చర్ అవడంతో సిమెంట్ పట్టి వేసారు. అదే మీటింగుకు వచ్చిన రాహూల్ గాంధీ తాను ప్రసంగించేటప్పుడు పక్కనె ఉన్న శివసేన కు కాలి దెబ్బతగిలిందని తెలిసి వెంటనె వచ్చి పరామర్శించారు.
యువజన కాంగ్రెస్ జాతీయ బాద్యులు కృష్ణ అల్లవారు దెబ్బతగిలిన తీరును రాహుల్ గాంధీకి వివరించగా రాహుల్ గాంధీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చెసారు నీకు అండగా ఉంటానని శివసేన రెడ్డికి మాటిచ్చిన రాహుల్ గాంధీ వెంటనె యువజన కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు బివి శ్రీనివాస్ ని, తన PA అలంకార్ ని పిలిచి చికిత్సకయ్యే పూర్తి బాద్యత తీసుకోమని ఆదేశించారు.