Price Comparison Tools: ఆధునిక జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది. అయినా సమయం సరిపోక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సమయం ఉన్నా.. అలసట మూలంగా బయటకు వెళ్లే ఓపిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ షాపింగ్‌ను సులభతరం చేస్తోంది. అయితే పెరిగిన ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ధరల వ్యత్యాసం, నాణ్యతా సమస్యలు కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో అదే టెక్నాలజీ ధరల పోలికను చూపిస్తూ సమస్యకు పరిష్కారం తెచ్చింది.
ఈ కామర్స్ ప్రాముఖ్యత..
రోజువారీ అవసరాలు, వస్త్రాలు, గృహోపకరణాలు ఫోన్ ఆర్డర్‌తో డోర్‌స్టెప్‌కు చేరుకుంటున్నాయి. పోటీతో ఒకే ప్రొడక్ట్‌కు విభిన్న ధరలు. ఇది సమయాన్ని, డబ్బును వృథా చేస్తుంది. మోసాలు కూడా పెరుగుతున్నాయి.
ధరల పోలికకు టూల్స్..
కొత్త టెక్ టూల్స్ ఈ సమస్యను పరిష్కరిస్తున్నాయి. ప్రొడక్ట్ లింక్ కాపీ చేసి Flash.co/ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తే అన్ని ప్లాట్‌ఫామ్‌ల ధరలు ఒక్క క్లిక్‌లో కనిపిస్తాయి. ఇది టైమ్, మనీ సేవ్ చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి..
ముందుగా కొనాలనుకునే ప్రొడక్ట్ లింక్ కాపీ చేయాలి. తర్వాత గూగుల్‌లో ‘Flash.co/‘ సెర్చ్ చేసి సైట్ ఓపెన్ చేయాలి. కాపీ చేసిన లింక్ సెర్చ్‌లో పేస్ట్ చేయాలి. వెంటనే బెస్ట్ ధరలు, ప్లాట్‌ఫామ్‌ల వివరాలు టేబుల్ ఫార్మాట్‌లో కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ ఒక యాప్‌లో రూ.20 వేలు ఉంటే.. మరొక యాప్‌లో రూ.18,500లకు దొరుకుతుంది. ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
ప్రయోజనాలు ఇవీ..
ధరలు, డిస్కౌంట్లు రియల్–టైమ్‌లో తెలుసుకోవచ్చు. నాణ్యతా రేటింగ్‌లు చూసి మోసాలు నివారించే అవకాశం ఉంటుంది. ఫీజులు, డెలివరీ ఛార్జీలు కూడా కన్పిస్తాయి. రెగ్యులర్ కస్టమర్లకు వారానికి రూ.500 నుంచి రూ.1000 సేవ్ చేసుకోవచ్చు.
ఈ టూల్స్ ఈకామర్స్ పోటీని కస్టమర్ అనుకూలంగా మలుస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి!