Rajendra Prasad
Rajendra Prasad : ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వివాదాలకు దారి తీసింది. ముఖ్యంగా ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డేవిడ్ వార్నర్(David Warner) ని బూతులు తిడుతూ మాట్లాడడం పై నెటిజెన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఒక క్రికెటర్ మన తెలుగు సినిమా మీద ఇష్టంతో ఇక్కడికి వస్తే, అతన్ని అలా అవమానించడం సరైనది కాదు, రాజేంద్ర ప్రసాద్ లాంటి దిగ్గజ నటుడికి ఇలాంటి మాటలు శోభించవు అంటూ కామెంట్స్ చేసారు. ఇప్పటికీ ఆ వీడియో పై సోషల్ మీడియా లో ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. సినిమా మీద ఒక విధమైన నెగటివ్ బజ్ ఏర్పాటు అయ్యేలా చేసింది రాజేంద్ర ప్రసాద్ స్పీచ్. ఇది ఇలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించిన మరో వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.
Also Read : డేవిడ్ వార్నర్ ని అడ్డమైన బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్న సమయంలో ఆయన కారు దిగి, ఆ కారు డోర్ ని కళ్ళతో కొట్టడం, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇంతకు ముందు ఆయన ఇలా ఉండేవాడు కాదే, ఆయన ప్రవర్తన చాలా బాగా ఉండేది కదా, అకస్మాత్తుగా ఏమిటి ఈ మార్పు అని అందరూ మాట్లాడుకున్నారు. కొంతమంది అయితే రాజేంద్ర ప్రసాద్ మద్యం సేవించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడా?, కచ్చితంగా అదే అయ్యుంటాది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అతి ఉత్సాహం వల్లే రాజేంద్ర ప్రసాద్ అలా ప్రవర్తించాడని మరి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆయన ‘సర్ప్రైజ్’ సాంగ్ లాంచ్ లో ఈవెంట్ లో కూడా ఇంతే ఉత్సాహం తో ఉన్నారు.
ఎందుకంటే ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ పట్ల అంతటి సంతృప్తి తో ఉన్నాడు కాబట్టి. చాలా కాలం తర్వాత తన వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు వచ్చింది. హీరో తో సమానమైన పాత్ర దొరికింది, దాని తాలూకా వచ్చిన ఉత్సాహమే ఇదంతా అని అంటున్నారు. అతి ఉత్సాహం వచ్చినప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. అంత మాత్రానా వీళ్లంతా మద్యం సేవించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మాట్లాడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ తో కూడా రాజేంద్ర ప్రసాద్ కి తనకు ఉన్న అతి చనువు కారణంగానే అలా మాట్లాడాడని, దానికి డేవిడ్ వార్నర్ కూడా స్పోర్టివ్ గానే రియాక్ట్ అయ్యాడని అంటున్నారు. ఇకపోతే రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మద్యం మత్తులో నటుడు రాజేంద్ర ప్రసాద్.. మరిన్నీ వీడియోలు వైరల్ #RajendraPrasad #Robinhood #UANow #Tollywood #Culture pic.twitter.com/uxdgtyceSI
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 24, 2025