https://oktelugu.com/

Salar 2 : రాసి పెట్టుకోండి ‘సలార్ 2’ వచ్చాక ఏ రికార్డ్ ఉండదు : ప్రశాంత్ నీల్…

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయనతో పోటీపడే నటులు ఆయన స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరు...

Written By: , Updated On : February 10, 2025 / 08:58 AM IST
Salar 2

Salar 2

Follow us on

Salar 2 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయనతో పోటీపడే నటులు ఆయన స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరు…ప్రస్తుతానికి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను ఏలుతున్న రాజు కూడా తనే కావడం విశేషం…ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే రాబోయే రోజుల్లో కూడా ఆయనకి తిరుగు ఉండదు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియాలో తన సత్తా చాటడమే కాకుండా ఈ సినిమా ఇచ్చిన హైప్ తో ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ (Prabhas) దర్శకత్వంలో చేసిన ‘సలార్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. తద్వారా ఈ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు రావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 700 కోట్ల కలెక్షన్లను రాబట్టి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక కల్కి సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను టచ్ చేసే హీరో మరెవరు లేరు అంటూ మరోసారి మిగతా హీరోలందరికి సవాల్ విసిరాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా సెట్స్ మీద ఉంది. ఇక దాంతో పాటుగా మారుతితో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు వచ్చింది.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా కూడా మే నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వీటితోపాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాకి సిక్వెల్ గా ‘సలార్ 2’ (Salar) సినిమా కూడా రాబోతుంది.

అయితే ఈ సినిమాని 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేసి రెండు వేల కోట్ల మార్కును కొల్లగొట్టాలనే ధృడ సంకల్పం తో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది…

మరి సలార్ సినిమా సాధించిన దానికంటే ఈ సినిమా డబుల్, త్రిబుల్ సూపర్ సక్సెస్ ని సాధించి భారీ వసూళ్లను రాబడుతుంది అంటూ ప్రశాంత్ నీల్ ఇంతకుముందే చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…