Salar Re Release
Salar Re Release : బాహుబలి 2 అనంతరం ప్రభాస్ హిట్ లేక ఇబ్బంది పడ్డారు. ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుసగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో ఆయన కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ప్రకటించిన సలార్ పై అంచనాలు ఏర్పడ్డాయి. కెజిఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ దేశాన్ని కుదిపేశాడు. కన్నడ యంగ్ హీరో యష్ కి ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది కెజిఎఫ్ సిరీస్. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. విడుదలైన అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకుంది.
హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు ప్రశాంత్ నీల్. ఇక ఆయన చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ రేపేలా ఉంటాయి. అలాంటి దర్శకుడితో మాస్ ఇమేజ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకునే ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందో అనే భావన ఆడియన్స్ లో ఏర్పడింది. సలార్ చిత్రం 2023లో విడుదల చేశారు. అయితే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, అసలు కథ మొత్తం పార్ట్ 2 కోసం ప్రశాంత్ నీల్ దాటుచేశాడనే విమర్శలు వినిపించాయి.
యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ప్రశాంత్ నీల్ అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించాడు. టాక్ తో సంబంధం లేకుండా సలార్ మూవీ రూ. 700 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. రెండేళ్లు కూడా గడవకుండానే సలార్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 21వ తేదీన సలార్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. నిర్మాతల ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇదే క్రమంలో 2025 సమ్మర్ ప్రభాస్ దే అనే వాదన మొదలైంది.
వేసవిలో పెద్ద హీరోల్లో ఒక్క చిరంజీవి నటించిన విశ్వంభర మాత్రమే విడుదల అవుతుంది. మిగతా హీరోలు ఎవరూ బరిలో లేరు. ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాబట్టి ఈ వేసవి సెలవుల్లో ప్రభాస్ సలార్, రాజాసాబ్ చిత్రాలతో వసూళ్లు కుమ్మేయడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. సలార్ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్, జగపతిబాబు, శృతి హాసన్, శ్రియా రెడ్డి, బాబీ సింహ కీలక రోల్స్ చేశారు.
Returning To His DEN “ ”#SalaarCeaseFire Strikes Back To Dominate The BIG Screen ! #Salaar RE – RELEASING On !#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @RaviBasrur @VKiragandur @hombalefilms @ChaluveG pic.twitter.com/ivWKQ4f0OH
— (@UrsVamsiShekar) February 24, 2025