Salaar : వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ, కెరీర్ లో వరస్ట్ ఫేస్ ని చూస్తున్న ప్రభాస్(Rebel star Prabhas) కి ‘సలార్'(Salaar Movie) చిత్రం ఇచ్చిన ఊపు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ మరియు డిస్నీ + హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఆశించిన రేంజ్ లో వ్యూస్ రాలేదు. కారణం హిందీ వెర్షన్ విడుదల అందులో లేకపోవడమే. నెట్ ఫ్లిక్స్ కానీ, వేరే ఏ ఓటీటీ యాప్ లో అయినా కానీ మన తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువగా హిందీ ఆడియన్స్ ఉంటారు. హిందీ వెర్షన్ విడుదల లేనప్పుడు నాలుగు వారాలకు మించి ట్రెండ్ అవ్వడం ఏ సినిమాకి అయినా కష్టమే.
Also Read : సలార్ రీరిలీజ్ డేట్: ఫ్యాన్స్ కి పూనకాలే, ఈ సమ్మర్ ప్రభాస్ దేనా?
అయితే సలార్ మూవీ హిందీ వెర్షన్ ని డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల చేశారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, ఈ చిత్రం హాట్ స్టార్ లో సుమారుగా 450 రోజుల నుండి నాన్ స్టాప్ గా ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ రేంజ్ లో ఒక ఇండియన్ సినిమా ఇన్ని రోజులు ట్రెండ్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. కనీసం హాలీవుడ్ సినిమాలు అయినా ఈ రేంజ్ ట్రెండ్ అయ్యాయా అంటే అనుమానమే. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది సలార్ హిందీ ఓటీటీ వెర్షన్. దీనిని బట్టి హిందీ ఆడియన్స్ ఈ చిత్రానికి ఎంతలా బానిసలు అయ్యారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వైపు సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సలార్ సీక్వెల్ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు.
కేవలం బాలీవుడ్ నుండే ఈ చిత్రానికి 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి చిత్రాలతో బిజీ ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన స్పిరిట్ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ఈ సినిమాల మీదనే ఉంది. కాబట్టి సలార్ సీక్వెల్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి లోపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తునం డ్రాగన్ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో, ఓటీటీ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సలార్ చిత్రం, టీవీ టెలికాస్ట్ లో మాత్రం డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్షన్ లేకుండా ఉండడం వల్లనే ఏమో, ఈ సినిమాకు టీవీ లో అలాంటి రెస్పాన్స్ వచ్చింది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : రాసి పెట్టుకోండి ‘సలార్ 2’ వచ్చాక ఏ రికార్డ్ ఉండదు : ప్రశాంత్ నీల్…