
Sairam Shankar ‘Resound’: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ‘సాయిరాంశంకర్’. డేరింగ్, డ్యాషింగ్ హీరోగా సాయి పేరు తెచ్చుకున్నాడు. దూకుడైన హీరోకు పర్యాయపదంగా నిలిచాడు. 143, డేంజర్, రోమియో వంటి చిత్రాల్లో హీరోగా నటించి అలరించాడు. మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పించారు. ‘పూరి’లాగానే మంచి కసి ఉన్న నటుడిగా తన పర్ ఫామెన్స్ ను తెరపై చూపించి తెలుగు వారి అభిమానాన్ని దోచుకున్నారు. అయితే హీరోగా సాయిరామ్ శంకర్ కు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సాయి మళ్లీ ముందుకు వస్తున్నాడు. సినిమాల్లో బిజీ అవుతున్నారు. మరోసారి తన అభినయంతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.
సాయిరామ్ శంకర్ హీరోగా ‘రీసౌండ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు సాయి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అదిరిపోయేలా ఉంది. సాయిరాంకు బర్త్ డే విషెస్ చెబుతూ సినిమా ఎలా ఉండబోతోందో చూచాయగా చిన్న టీజర్ లో చూపించారు. ఈ చిత్రం ద్వారా ఎస్ఎస్ మురళీకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చివరి దశకు వచ్చింది. ఈ మూవీని సురేశ్ రెడ్డి, అయ్యప్పరాజు , రాజారెడ్డి నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు.
మోషన్ పోస్టర్ చూడగానే అదిరిపోయేలా డిజైన్ చేశారు. ఒక పాడుబడిన ఇంట్లో సాయిరాంశంకర్ ఠీవీగా కుర్చీలో కూర్చొని సిగరేట్ ను అంటించే సీన్ హైలెట్ అనే చెప్పాలి. ఇక సాయి ముందు విలన్లను కొట్టి వేలాడదీసిన చిత్రాన్ని చూపించారు. సాయి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘రీసౌండ్’ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఎంతో ఉత్కంఠ రేపేలా వినిపించారు.
పోసాని కృష్ణమురళి, అరవింద్ కృష్ణ, అజయ్ ఘెష్, కాశీ విశ్వనాథ్, అదుర్స్ రఘు, పింకీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న సాయిరాంశంకర్ ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొడుతాడని చిత్ర బృందం ధీమాతో ఉంది.మోషన్ పోస్టర్ లో కూడా సాయి పూర్తి డిఫెరెంట్ లుక్ లో కనిపించాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
-రీసౌండ్ మోషన్ పోస్టర్ ను కింద చూడొచ్చు.
