Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi Bollywood Look: పద్దతిగా ఉండే సాయి పల్లవి ఇలా మారిపోయిందేంటి.. బాలీవుడ్...

Sai Pallavi Bollywood Look: పద్దతిగా ఉండే సాయి పల్లవి ఇలా మారిపోయిందేంటి.. బాలీవుడ్ కి వెళ్తే ఇంతేనా..

Sai Pallavi Bollywood Look: ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగాలంటే కేవలం అందాల ఆరబోత ఉంటేనే కాదు , నటన తో కూడా అద్భుతంగా రాణించగలం అని నిరూపించిన హీరోయిన్స్ మన ఇండియా లో అతి తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఆ తక్కువమందిలో ఒకరే సాయి పల్లవి. ఈమె చూసేందుకు మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే పెద్ద అందంగా ఉండదు, మన ఇంట్లో అమ్మాయి ఎలా అయితే ఉంటుందో , అలాగే ఉంటుంది. కానీ ఈమె అద్భుతంగా నటించగలదు , అంతకు మించి డ్యాన్స్ వేయగలదు , అందుకే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోయిన్ కి లేనంతగా ఉంది. అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. అంటే మగవాళ్లలో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో , ఆడవాళ్ళలో సాయి పల్లవి కి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నమాట.

దానికి తోడు ఈమె అవకాశాల కోసం ఏ రోజు కూడా అందాలు ఆరబోసే పొట్టి దుస్తుల్లో కనిపించలేదు. అలాంటి వాటికి ఈమె చాలా దూరం . ఒక గీత గీసుకొని , దానిని దాటకుండా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో , అప్పటి నుండి పూర్తి గా మారిపోయింది. రీసెంట్ గానే ఒక ఈవెంట్ కి వచ్చిన ఈమె , పొట్టి దుస్తుల్లో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. మేము మా కళ్ళతో చూస్తున్న అమ్మాయి సాయి పల్లవి యేనా?, అసలు నమ్మలేకపోతున్నాము , ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం , చివరికి సాయి పల్లవి కూడా ఇలాంటి దారిని ఎంచుకుంటుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆమె అబ్జిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో గా నటించిన ‘ఏక్ దిన్ ‘ అనే చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున ఇండియా వైడ్ గా 2 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో కూడా ఈ చిత్రం ‘ఒక రోజు’ అనే పేరుతో విడుదలైంది కానీ, ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సాయి పల్లవి బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ఫ్లాప్ ని అందుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Gossips (@tollywoodgosip1)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular