https://oktelugu.com/

Sai Pallavi: సాయి పల్లవికి నాని వలన నిద్ర లేని రాత్రులు, ఏడ్చేయడంతో నిర్మాతను కలిసిన చెల్లి, మేటర్ ఏంటంటే?

హీరో నాని మూవీ సెట్స్ లో సాయి పల్లవి నరకం చూసిందట. నిద్రలేని రాత్రులు గడిపిందట. తన బాధను చెల్లితో చెప్పుకుని ఏడ్చిందట. దాంతో సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నేరుగా నిర్మాతను కలిసిందట. ఇంతకీ ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 12, 2024 / 10:01 AM IST

    Sai Pallavi(1)

    Follow us on

    Sai Pallavi: సాయి పల్లవి టాలీవుడ్ లో సైతం భారీ ఫేమ్ ఉన్న హీరోయిన్. తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకుంది. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి, అరంగేట్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫిదా మూవీ సాయి పల్లవి ప్రధానంగా సాగుతుంది. వరుణ్ తేజ్ పాత్రకు మించిన ప్రాధాన్యత సాయి పల్లవి పాత్రకు ఉంటుంది. ఫిదా అనంతరం సాయి పల్లవి నటించిన ఎంసీఏ, లవ్ స్టోరీ వంటి చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి. హీరో నానితో సాయి పల్లవిది హిట్ కాంబినేషన్. ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో వీరు కలిసి నటించారు.

    ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి. శ్యామ్ సింగరాయ్ మూవీలో సాయి పల్లవి దేవదాసి రోల్ చేయడం విశేషం. ఈ మూవీ షూటింగ్ వలన సాయి పల్లవి చాలా ఇబ్బందులు పడిందట. సాయి పల్లవికి రాత్రుళ్ళు షూట్ చేసే అలవాటు లేదట. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ మొత్తం రాత్రివేళ చేసేవారట. తెల్లారే వరకు షూటింగ్ జరుగుతూనే ఉండేదట. పగలు మరలా ఇతర మూవీ షూటింగ్స్ లో ఆమె పాల్గొనాల్సి వచ్చేదట.

    దాంతో సాయి పల్లవికి అసలు నిద్ర ఉండేది కాదట. నిద్రలేమి వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందట. ఈ విషయాన్ని తన చెల్లి పూజ ఖన్నాకు చెప్పి కన్నీరు పెట్టుకుందట. ఒక్క రోజైనా సెలవు దొరికితే బాగుండు. విశ్రాంతి తీసుకుంటాను అని సాయి పల్లవి తన సిస్టర్ తో చెప్పిందట. అప్పుడు పూజ ఖన్నా నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత వెంకట్ బోయినపల్లిని కలిసి పరిస్థితి వివరించిందట.

    వెంకట్ బోయినపల్లి ప్రశాంతంగా 10 రోజులు విశ్రాంతి తీసుకో. తర్వాతే షూటింగ్ కి రా, ఎలాంటి ఇబ్బంది లేదని సాయి పల్లవితో అన్నాడట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది సాయి పల్లవి. ఆమె లేటెస్ట్ మూవీ అమరన్ భారీ విజయం అందుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. తెలుగులో సైతం అమరన్ విశేష ఆదరణ దక్కించుకుంది.

    సాయి పల్లవి తెలుగులో తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ డ్రామా చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత కాగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. రన్బీర్ కపూర్ కి జంటగా రామాయణం చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ రెండు మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. ఆ మధ్య కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి జోరు పెంచింది.