China Hypersonic Plane: ఏడు గంటల్లో భూమిని చుట్టి రావచ్చు సరే.. కాలుష్యం మాటేమిటి? చైనా హైపర్ సానిక్ విమానాల వల్ల అంతరిక్షం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందంటే?

ఇప్పటికే అంతరిక్షం డస్ట్ బిన్ అయిపోయింది. గ్రహశకలాలు, తోకచుక్కల విస్ఫోటనం, మానవ తయారీ ఉపగ్రహాలతో అంతరిక్షం ఓ ఈ వెస్ట్ డస్ట్ బిన్ అయిపోయింది.. ఇప్పుడు దీనికి చైనా విమానాలు తోడు కాబోతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 12, 2024 9:57 am

China Hypersonic Plane(1)

Follow us on

China Hypersonic Plane: 1986 నవంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన ఓ కంకార్డ్ విమానం భూమి చుట్టూ తిరిగి రికార్డు సృష్టించింది. దీనికోసం 29 గంటల 59 నిమిషాల సమయం తీసుకుంది. అప్పట్లో ఇది ఒక రికార్డు. అయితే ఇప్పుడు ఈ రికార్డును చైనా దేశానికి చెందిన స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ బద్దలు కొట్టే పని మొదలుపెట్టింది. విమానయాన రంగంలో సరికొత్త సంచలనాలకు చైనా కంపెనీ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ శ్రీకారం చుట్టింది. శబ్దానికి మించి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని రూపొందించింది. ఇది గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానం ఎక్కి భూమి చుట్టూ జస్ట్ ఏడు గంటల్లో తిరిగి రావచ్చు.

విపరీతమైన కాలుష్యం

హైపర్ సానిక్ విమానాల వల్ల విపరీతమైన కాలుష్యం వెలువడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాలు సంప్రదాయ విమానాలతో పోల్చితే అధికంగా ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. అందువల్ల కాలుష్య స్థాయి పెరుగుతుంది. పైగా ఈ విమానాలలో భారీ సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లడం సాధ్యం కాదు. తక్కువ మందితోనే ప్రయాణించడానికి సాధ్యమవుతుంది. ఈ విమానాల వల్ల వేగం మాత్రమే సాధ్యమవుతుంది. విపరీతమైన ఇంధనం ఖర్చవుతుంది. పైగా ఈ విమానాలలో సామాన్యులు ప్రయాణించడానికి అవకాశం ఉండదు. గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. హైపర్ సానిక్ విమానాలు అందుబాటులోకి వస్తే.. సాధారణ విమానాలకు గిరాకీ అంతంత మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. హైపర్ సానిక్ విమానాలు విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతాయి. విపరీతమైన ఇంధనాన్ని వినియోగిస్తాయి. దీనివల్ల శిలాజ ఇంధనాలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. హైపర్ సానిక్ విమానాలు వెలువరించే పొగ వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రమాదకరమైన వాయువులు వెలువడుతుంటాయి. ఇప్పటికే అంతరిక్షం డస్ట్ బిన్ లాగా మారింది. దానికి తోడు ఈ హైపర్ సానిక్ విమానాల వల్ల కాలుష్యం తారస్థాయికి చేరుతుంది. దానివల్ల వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే సహారా ఎడారిని వరదలు ముంచెత్తాయి. అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. అక్కడ వృక్షాలు పెరుగుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలలో మట్టాలు గతం కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. వివిధ నివేదికల ప్రకారం భవిష్యత్తు కాలంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. గ్రీన్ హౌస్ వాయువుల వల్లే ఈ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని సమాచారం. హైపర్ సానిక్ విమానాల నుంచి వెలువడే ఉద్గారాల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు గాల్లోకి విడుదలవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేగం మాత్రమే

హైపర్ సానిక్ విమానాలలో ప్రయాణికులను ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఇవి వేగంగా మాత్రమే వెళ్తాయి. విపరీతమైన ఇంధనాన్ని వినియోగిస్తాయి. ఉదాహరణకి పది విమానాలు వినియోగించే ఇంధనాన్ని ఒక హైపర్ సానిక్ విమానంలో పోయాల్సి ఉంటుంది. పైగా అందులో తక్కువ పరిమితిలోనే ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సాధారణ విమానాలలో ప్రయాణికులను ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. సమయం, వేగం మినహా మిగతా అన్నింటిలోనూ హైపర్ సానిక్ విమానాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు. అగర్బ శ్రీమంతులు మాత్రమే అందులో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది..