https://oktelugu.com/

Sai Pallavi : తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి..ఈ కాలంలో కూడా ఇలాంటి హీరోయిన్స్ ఉంటారా!

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి మాత్రమే.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 05:10 PM IST

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi : ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి మాత్రమే. ఈ నటన, డ్యాన్స్ కి ఫిదా కానీ మూవీ లవర్ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరూ ఈమెని ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమెకు ఆడవాళ్ళలో ఉందని అర్థం. అయితే తనకి ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు రెమ్యూనరేషన్స్ ని డిమాండ్ చేయడం, చేతికి అందిన ప్రతీ సినిమాని చేయడం వంటివి ఈమె చేయదు. ఈమె ఒక సినిమా ఒప్పుకుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుంది. నటనకి కావాల్సినంత ప్రాధాన్యత ఉంటుంది. అలా ఉంటనే ఈమె ఒక సినిమాకి సంతకం చేస్తుంది.

    ఇతర హీరోయిన్స్ లాగ అందాల ఆరబోతలు చేయడం, హద్దు మీరు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఈమెకి ఇష్టం ఉండదు. చిన్న ముద్దు సన్నివేశం లో నటించాలన్నా అందులో కంటెంట్, ఎమోషన్ బలంగా ఉంటేనే చేస్తుంది. అంతే కాదు ఈమె షూటింగ్ వచ్చినప్పుడు తన ఖర్చులు మొత్తం తానే చూసుకుంటుంది, తన స్టాఫ్ ఖర్చులు కూడా ఈమెనే భరిస్తుంది. హోటల్ ఖర్చులు, తిండి ఖర్చులు వంటివి కూడా ఈమె చూసుకుంటుంది. ఇతర హీరోయిన్స్ ఇలా ఉండరు. చాలా డిమాండ్ గా ఉంటారు, నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతారు. కానీ సాయి పల్లవి అలాంటి అమ్మాయి కాదు. ఈ అమ్మాయిలో ఉన్న మరో గొప్ప గుణం కూడా నేడు ఒకటి బయటపడింది. అప్పట్లో ఈమె శర్వానంద్ తో కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రం మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

    ఫస్ట్ హాఫ్ కి అప్పట్లో మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా ఉంది, బోర్ కొట్టింది అంటూ రివ్యూస్ వచ్చాయి. దీంతో ఈ చిత్రం అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు కానీ సాయి పల్లవి కి మాత్రం ఈ చిత్రం వ్యక్తిగతంగా చాలా ఇష్టం. సినిమా ప్రారంభానికి ముందే ఈమె అడ్వాన్స్ తీసుకుంది. సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యాక కమర్షియల్ ఫ్లాప్ అని ఆమెకు తెలిసింది. నిర్మాత బాగా నష్టపోయాడని అర్థం చేసుకుంది. అయినప్పటికీ ఆ చిత్ర నిర్మాత పూర్తి రెమ్యూనరేషన్ చెక్ ని సాయి పల్లవి కి అందిస్తుండగా, ఆమె తీసుకోలేదు. అసలే కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నాకు ఇది ఎందుకులేండి అని చెప్పి 40 లక్షల రూపాయిలను వదులుకుంది. ఈ కాలం లో ఇంత గొప్ప మనసు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా మనం చూశామా?, నిర్మాతలను పిచ్చి పిచ్చి డిమాండ్స్ తో ముప్పు తిప్పలు పెట్టే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో సాయి పల్లవి లాంటోళ్ళు ఉండడం నిజంగా నిర్మాతలు చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు.