Star Hero: అప్పట్లో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ రాధిక కూడా ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్ రాధిక ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈమె ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక రాధిక చెల్లెలు నిరోషా కూడా అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. నిరోషా టాలీవుడ్ లో హీరో బాలకృష్ణకు జోడిగా నారీ నారీ నడుమ మురారి అలాగే చిరంజీవికి జోడిగా స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలలో నిరోషా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలా నిరోషా రాధికా చెల్లెలిగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక తమిళ్ నుంచి తెలుగులోకి డబ్బై నా ఘర్షణ సినిమాలో కూడా నిరోషా నటించడం జరిగింది. నిరోషా గురించి ఇంకా చెప్పాలంటే 1980 వ సంవత్సరంలో దూరదర్శన్ లో చిత్రలహరిలో ఒక బృందావనం సోయగం అనే పాట అందరికీ బాగా ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటను చూసినవాళ్లు నిరోషాను బాగా గుర్తుపట్టగలరు. ఇక నిరోషా 1988లో తమిళ దర్శకుడు దేవరాజ్ దర్శకత్వంలో సింధూరపువ్వు అనే సినిమాలో నటించింది. 1989లో ఈ సినిమా తెలుగులో సింధూరపువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయింది.
ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయం తరువాత దూరదర్శన్ చిత్రాలహరి లో సింధూరపువ్వే నువ్వే చిందించరావే అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తున్న సమయంలో దర్శకుడు దేవరాజ్ రాధిక చెల్లెలు నిరోషాను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే దర్శకుడు ఈ సినిమా హీరో రాంకీ కి నిరోషా ఫోటోను చూపించినప్పుడు ఈమె ఏంటి పనిమనిషిలా ఉందని రాంకీ చెప్పడం జరిగింది.
ఇక చివరకు నిరోషాను సింధూరపువ్వు సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరూ కలిసి తమిళ్ లో 7 శత దినోత్సవ సినిమాల్లో నటించారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా రామ్కీ లక్కీ భాస్కర్ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రాంకీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించని.లక్కీ భాస్కర్ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటిటీ నెట్ ఫ్లిక్ లో ప్రసారం అవుతుంది.