NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ‘నందమూరి తారక రామారావు’ దగ్గర నుంచి ‘జూనియర్ ఎన్టీఆర్’ వరకు వీళ్ళ ఫ్యామిలీకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. వీళ్ళు చేసే ప్రతి సినిమా కూడా యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కూడా హెల్ప్ చేస్తున్నాయి… ఇక ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ మార్కెట్ చేసుకున్న నటుడు ఎన్టీఆర్…దేవర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. మరి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ భారీ విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లనైతే కొల్లగొట్టడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. కారణం ఏంటి అంటే దేవర సినిమా కంటెంట్ బాగున్నప్పటికి కొరటాల శివ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించిన కూడా ఈ సినిమాకి తక్కువ కలెక్షన్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ కి ఇంతకుముందు నందమూరి ఫ్యామిలీ అభిమానుల నుంచి మంచి ఆదరణ అయితే ఉండేది. అలాగే టిడిపి కార్యకర్తలు నుంచి కూడా భారీగా సపోర్టు లభించేది. దానివల్ల ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ ను కొలగొట్టేవి…కానీ గత కొద్ది నుంచి ఆయన చంద్రబాబు నాయుడుతో గాని, బాలయ్య బాబుతో గానీ మాట్లాడకుండా వాళ్లకు చాలా దూరంగా ఉంటున్నాడు. ఇక దానికి తోడుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా అసలు ఏమి పట్టించుకోనట్టు ఉండడం అతని పరామర్శించలేదు. ఇక ఇలాంటి సంఘటనలు చేయడం వల్ల కార్యకర్తలు చాలా వరకు ఎన్టీఆర్ ను బాయ్ కట్ చేశారు.
అతని సినిమాలు చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. దానివల్లే వాళ్ల నుంచి ఆదరణ లోపించింది. తద్వారా సినిమా కలెక్షన్స్ మీద భారీగా ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చెయ్యబోతున్న సినిమా కోసం ఆయన భారీగా కసరత్తులైతే చేస్తున్నాడు.
ఇక ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ ను పదిలంగా ఉంచుకోవాలంటే మాత్రం అటు నందమూరి అభిమానులతో గానీ, ఇటు టిడిపి కార్యకర్తలతో గానీ ఆయన సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయనకు భారీగా దెబ్బపడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా అది చాలా స్పష్టంగా కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే ఎప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి.
ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీ రికార్డులను కొల్లగొడతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ప్రశాంత్ నీళ్లతో చేయబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…