National India Hub: ప్రపంచంలో అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్‌ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

నేషనల్‌ ఇండియా హబ్‌ గురించి వ్యవస్థాపకుడు హరీశ్‌ కొలసాని, వ్యవస్థాపక సభ్యుడు కేకే.రెడ్డి ఈ వేదిక మీదుగా వివరించారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 19, 2024 11:07 am

National India Hub

Follow us on

National India Hub: భారతీయులు ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే మనవాళ్లు ఫస్ట్‌ ప్రయారిటీ మాత్రం అగ్రరాజ్యం అమెరికాకే ఇస్తున్నారు. అందుకే అమెరికా జనాభాలో 10 శాతానికిపైగా భారతీయులే. అందుకే అమెరికాలోని చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్‌ ఇండియా హబ్‌ ప్రారంభించారు. కాన్సులేట్‌ జనరల్‌ సోమనాథ్‌ ఘోష్‌ ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇంద్రాణి ఫేమ్‌ అంకిత ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇండియా హబ్‌ గురించి..
ఇక నేషనల్‌ ఇండియా హబ్‌ గురించి వ్యవస్థాపకుడు హరీశ్‌ కొలసాని, వ్యవస్థాపక సభ్యుడు కేకే.రెడ్డి ఈ వేదిక మీదుగా వివరించారు. ఈ హబ్‌ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. Unite, Celebrate, Healp Each Other చేసినట్లు వివరించారు. నేషనల్‌ ఇండియా హబ్‌ ద్వారా అన్ని సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

గిన్నిస్‌ రికార్డు..
నేషనల్‌ ఇండియా హబ్‌ ద్వారా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్‌ కిందకు రావటం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ చోటు చేసుకునే విషయమని తెలిపారు. ఎడ్యకేషన్, హెల్త్‌ కేర్, సీపీఆర్‌ ట్రైనింగ్, ఇమ్మిగ్రేషన్‌ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్‌గా నేషనల్‌ ఇండియా హబ్‌ను ఏర్పాటు చేయటంపై పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.