https://oktelugu.com/

Pawan Kalyan: వెంకటేష్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

నిజానికి ఈ మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. పవన్ కళ్యాణ్ వెంకటేష్ లా మధ్య అన్నదమ్ముల రిలేషన్ షిప్ అయితే ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 08:58 AM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళు మాత్రమే స్టార్ హీరోలుగా వెలుగొందుతూ ఉండేవారు. ఇక వీళ్లకు సపోర్టుగా శ్రీకాంత్, జగపతిబాబు, మోహన్ బాబు, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ లాంటి నటులు తమ నట విశ్వరూపాన్ని చూపిస్తూ సినిమాలు చేస్తూ సక్సెస్ అయితే అయ్యవారు. ఇక మొత్తానికైతే వెంకటేష్ అయితే తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యేవాడు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలే కావడం విశేషం.

    ఇక ఇదిలా ఉంటే గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఇదే సమయంలో వెంకటేష్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి నచ్చిన సినిమాలు ఏంటి అని అడిగితే దానికి సమాధానం గా ఆయన బొబ్బిలి రాజా, చంటి, రాజా సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం విశేషం…

    నిజానికి ఈ మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. పవన్ కళ్యాణ్ వెంకటేష్ లా మధ్య అన్నదమ్ముల రిలేషన్ షిప్ అయితే ఉంటుంది. ఇక వెంకటేశ్ కి చిరంజీవితో మొదటి నుంచి కూడా మంచి పరిచయం ఉండడంతో పవన్ కళ్యాణ్ తో కూడా అదే రిలేషన్ షిప్ ని మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు.

    ఇక వాస్తవానికి వెంకటేష్ కి ఏమాత్రం ఈగో అయితే ఉండదు. అందువల్లే ఆయన అందరి హీరోలతో కలిసి పోతూ ఉంటాడు. ఇక అందరి హీరోల అభిమానులు కూడా వెంకటేష్ అభిమానులుగా అంటారనే చెప్పాలి. ఇంకా వాళ్ళందరూ వెంకటేష్ సినిమాలనే చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందువల్లే వెంకటేష్ కి ఇండస్ట్రీ లో హేటర్స్ ఎవరూ ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…