Most Beautiful Buildings: రూపు అద్భుతం.. నిర్మాణం ఆశ్చర్యం.. ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలివి..

ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపంగా తాజ్ మహల్ నిర్మించారు. తెల్లని పాలరాతిని దీని నిర్మాణం కోసం వినియోగించారు. అత్యంత సంక్లిష్టమైన డిజైన్ తో ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 11:46 am

Most Beautiful Buildings

Follow us on

Most Beautiful Buildings: వాటి నిర్మాణం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆకృతి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. వాటి సృజనాత్మకత కనులవిందు చేస్తుంది. అందుకే ఇవి అందమైన భవనాలుగా పేరుపొందాయి.. ప్రపంచ చరిత్రలోనే తమకంటూ ఒక పేజీని సృష్టించుకున్నాయి. ఇంతకీ ఈ భవనాలు ఎక్కడ ఉన్నాయంటే..

తాజ్ మహల్, ఆగ్రా, భారతదేశం

ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపంగా తాజ్ మహల్ నిర్మించారు. తెల్లని పాలరాతిని దీని నిర్మాణం కోసం వినియోగించారు. అత్యంత సంక్లిష్టమైన డిజైన్ తో ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మృత్యర్థం తాజ్ మహల్ నిర్మాణానికి సంకల్పించాడు. ఇస్లామిక్, పర్షియన్, ఒటోమాన్, టర్కిష్, భారతీయ నిర్మాణశైలి ఈ భవనం లో కనిపిస్తుంది. గంభీరమైన గోపురం, దాని చుట్టూ ఉన్న మినార్లు, సుందరమైన ఉద్యానవనం.. ప్రపంచ వారసత్వ సంపదగా పేరుపొందాయి. ఇది ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా కొనసాగుతోంది.

సగ్రడా ఫామీలియా, బార్సిలోనా, స్పెయిన్

ఆంటోనీ గౌడి నిర్మించిన సగ్రడా ఫామీలియా ఆధునిక వాస్తు శిల్పంగా పేరు పొందింది. 1882 లో దీని నిర్మాణం మొదలైంది. కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని పూర్తి చేశారు. విస్తృతమైన డిజైన్ కు ఇది ప్రసిద్ధి చెందింది. గౌడి రూపొందించిన గోతిక్, ఆర్ట్ నోయువే రూపాలు ఈ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. కిష్టమైన ముఖ భాగాలు, ఎత్తైన స్పైయర్లు, అద్భుతమైన ఇంటీరియర్ సాగ్రడా ఫామిలీయాలో సహజ కాంతిని వెదజల్లుతాయి.

సగ్రడా ఫామీలియా, బార్సిలోనా, స్పెయిన్

సిడ్ని ఒపేరా హౌస్ : సిడ్ని

సిడ్ని ఒపేరా హౌస్ ఆస్ట్రేలియా ఐకానిక్ చిహ్నం. ఇది ఆధునిక వాస్తు శిల్పం లాగా ప్రసిద్ధి చెందింది. దానిష్ ఆర్కిటెక్ట్ జోర్న్ ఉట్జోన్ దీనిని రూపొందించాడు. దీనిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఇది సెయిల్ లాంటి డిజైన్ పోలి ఉంది. వాటర్ ఫ్రంట్ లోకేషన్ ఈ నిర్మాణానికున్న ప్రత్యేకత. తెల్లని పెంకులతో.. చుట్టుపక్కల నౌకాశ్రయాలతో ఈ నిర్మాణం సహజ సుందరంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కువమంది ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించిన నిర్మాణంగా ఇది పేరుపొందింది.

సిడ్ని ఒపేరా హౌస్ : సిడ్ని

వైర్సెల్లెస్ ప్యాలెస్, ఫ్రాన్స్

వైర్సెల్లెస్ ప్యాలెస్ ఫ్రెంచ్ నిర్మాణ ఆకృతిని ప్రతిబింబిస్తుంది. దీనిని లూయిస్ XIV ప్యాలెస్ గా రూపొందించాడు. ఆల్ ఆఫ్ మిర్రర్స్, షాన్డిలియర్లు, కుడ్య చిత్రాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, అధునాతనమైన తోటలు, అలంకరించిన గదులు, గ్యాలరీలు, సంపూర్ణ రాజరికం, కళాత్మకత శ్రేష్టతకు ఇది అద్దం పడుతుంది.

వైర్సెల్లెస్ ప్యాలెస్, ఫ్రాన్స్

బుర్జ్ ఖలిఫా, దుబాయ్

బుర్జ్ ఖలిఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనం. ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భూమ్మీద నుంచి 828 మీటర్ల ఎత్తులో ఈ ఆకాశ హార్మ్యం ఉంది. దుబాయ్ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆర్కిటెక్ట్ ఆండ్రియన్ స్మిత్ దీన్ని రూపొందించాడు. ఇస్లామిక్ నిర్మాణ శైలి నుంచి ప్రేరణ పొంది, అతడు ఈ నిర్మాణ ఆకృతికి రూపం ఇచ్చాడు. దుబాయ్ వేగవంతమైన అభివృద్ధికి, ఆశయానికి ఇది నిదర్శనం గా నిలుస్తుంది.

బుర్జ్ ఖలిఫా, దుబాయ్

సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి, మాస్కో, రష్యా

రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న రెడ్ స్క్వేర్ ప్రాంతంలో సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి ప్రపంచంలోనే ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. ఇది 16వ శతాబ్దంలో ఇవాన్ ది టెర్రిబుల్ చేతిలో రూపుదిద్దుకుంది. ఇది ప్రత్యేక డిజైన్ లో కనిపిస్తుంది. రంగురంగుల ఉల్లిపాయ ఆకృతి గోపురాలు, క్లిష్టమైన నమూనాలు ఈ చర్చి సొంతం. ఇది రష్యన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. దీనికి వాడిన శక్తివంతమైన రంగులు రష్యా శైలిని ప్రతిబింబిస్తాయి.

సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి, మాస్కో, రష్యా

బ్లూ మసీదు: ఇస్తాంబుల్

ఇస్తాంబుల్ ప్రాంతంలో ఒట్టోమాన్ బ్లూ మసీదు చారిత్రక ప్రసిద్ధి చెందింది. సుల్తాన్ అహ్మద్ ఈ మసీదును నిర్మించాడు. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈ మసీదు నిర్మాణం ప్రారంభమైంది. ఆరు మినార్లు, నీలం రంగులో ఈ మసీదు నిర్మించారు. 20వేలకు పైగా చేతితో తయారుచేసిన సిరామిక్ టైల్స్ ఈ మసీదుకు ప్రత్యేక ఆకర్షణ. ఈ మసీదు విశాల ప్రాంగణం, భారీ గోపురం, అందమైన కాలిగ్రఫీ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇస్తాంబుల్ నగరం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఈ మసీదు ప్రతీక.

బ్లూ మసీదు: ఇస్తాంబుల్