NTR- Sai Pallavi: ఎన్టీఆర్‌ తో సాయిప‌ల్ల‌వి ఫిక్స్.. ఆ హీరోయిన్ కూడా !

NTR- Sai Pallavi: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఆచార్య ప్లాప్ దెబ్బతో ఈ సినిమా విషయంలోనైనా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయ‌నున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను […]

Written By: Shiva, Updated On : May 6, 2022 9:37 am
Follow us on

NTR- Sai Pallavi: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఆచార్య ప్లాప్ దెబ్బతో ఈ సినిమా విషయంలోనైనా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయ‌నున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు.

NTR- Sai Pallavi

కానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తానికి ఎన్టీఆర్ కి అలియా షాక్ ఇచ్చింది. అయితే, ఆలియా భట్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలి ? ఇదే కొరటాలలో మెదులుతోన్న ప్రశ్న. అలియా స్థాయి హీరోయిన్ కావాలంటే.. కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి.

Also Read: KGF 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

అందుకే.. కియారా అద్వానీ పేరు బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు క్రేజీ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి పేరు వినిపిస్తోంది. సాయి ప‌ల్ల‌వి మంచి నటి. ఆమె ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే.. ఇక స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. అందుకే, సాయి పల్లవిని కొరటాల ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఇక శ్రీలీల‌ను రెండో హీరోయిన్‌గా తీసుకోబోతున్నారు.

NTR- Sai Pallavi

ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు.

మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

Also Read:Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !

Tags