https://oktelugu.com/

ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెద్ద ముదుర్లు… ఏం చేస్తున్నారో తెలుసా?

బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్స్ గతంలో కంటే ఎంతో కొంత ఫేమ్ సాధించారు అనేది నిజం. ఈ ఫేమ్ ని ఎలా వాడుకోవాలో బాగా వంటబట్టించుకున్నారు వీరు. ఆదాయం సమకూర్చే ఏమార్గాన్నీ వదలడం లేదు. హౌస్ లో బాగా ఫేమస్ అయిన గంగవ్వ, లాస్య, మెహబూబ్, అవినాష్ అనేక విధాలుగా డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. ఇక సోహైల్ అయితే హౌస్ నుండి బయటికి వచ్చి వారం గడవక ముందే మూవీ ప్రకటించేశారు. జనవరి నుండి […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 / 07:28 PM IST
    Follow us on


    బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్స్ గతంలో కంటే ఎంతో కొంత ఫేమ్ సాధించారు అనేది నిజం. ఈ ఫేమ్ ని ఎలా వాడుకోవాలో బాగా వంటబట్టించుకున్నారు వీరు. ఆదాయం సమకూర్చే ఏమార్గాన్నీ వదలడం లేదు. హౌస్ లో బాగా ఫేమస్ అయిన గంగవ్వ, లాస్య, మెహబూబ్, అవినాష్ అనేక విధాలుగా డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. ఇక సోహైల్ అయితే హౌస్ నుండి బయటికి వచ్చి వారం గడవక ముందే మూవీ ప్రకటించేశారు. జనవరి నుండి సోహెల్ కొత్త సినిమా మొదలుకానుంది. మిగతా కంటెస్టెంట్స్ కూడా వరుస ఇంటర్వ్యూలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

    Also Read: తొందరపడుతున్న రజనీకి కరోనా షాక్!

    ఈ సీజన్లో పాల్గొన్న గంగవ్వ సంచలనాలు చేస్తుంది. ఆమె హౌస్ లో ఉంది కొద్దిరోజులే ఆయినా గొప్ప ఆదరణ సంపాదించుకుంది. దీనితో ఆమె అనేక బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. ఇక ఆమె యూట్యూబ్ ఛానల్ కొరకు వరుస వీడియోలు చేస్తుంది. యూట్యూబ్ ద్వారా గంగవ్వ ఆదాయం మంచిగా ఉంది. అలాగే దిల్ సే మెహబూబ్ బయటికి రావడంతోనే తన యూట్యూబ్ ఛానల్ ని ఫేమస్ చేసే పనిలో పడ్డాడు. ఆయన సొంత ఊరు గుంటూరుకు వెళ్లే వీడియో నుండి, కుటుంబాన్ని పరిచయం చేయడం, సోహెల్ ఇంటికి వెళ్లడం వంటి అనేక వీడియోలు చేసి తన ఛానల్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు లక్షల వ్యూస్ అందుకోని, మంచి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

    Also Read: కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

    అలాగే అవినాష్ యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. కాగా కొన్ని ఛానల్స్ ఆయనతో కామెడీ షోలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరో కంటెస్టెంట్ లాస్య సైతం యూట్యూబ్ ద్వారా మంచిగా ఆదాయం పొందుతున్నారు. ఆమె గంగవ్వ ఇంటి వద్ద చేసిన వీడియో మంచి వ్యూస్ రాబట్టింది. గంగవ్వ ఇల్లు, పొలాలు షూట్ చేయడంతో పాటు ఆమెతో జరిపిన ముచ్చట్లు జనాలు తెగ చూశారు. ఇలా చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రజలు మర్చిపోయే లోపే కొంచెం సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్