‘ఆర్ఆర్ఆర్’పై రైటర్ సాయి మాధవ్‌ కీలక అప్‌డేట్‌

సాయిమాధవ్ బుర్రా. మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారైనా కలవాలని హైదరాబాద్‌కు వచ్చిన ఆయన… ఏకంగా ఆయన సినిమాలకే మాటలు రాసే రచయితగా ఎదిగాడు. టాలీవుడ్‌లో ఇప్పుడు సాయి మాధమ్‌ చాలా ఫేమస్‌. పరుచూరి బ్రదర్స్‌ తర్వాత ఆ స్థాయిలో పవర్ఫుల్‌ డైలాగ్స్‌ రాయడంలో దిట్ట. ‘కృష్ణం వందే జగద్గురుమ్’తో టాలీవుడ్‌కు పరిచయం అయిన బుర్రా ఫస్ట్ మూవీతోనే అద్భుత డైలాగ్స్‌తో మెప్పించాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘గోపాల గోపాల’, ‘మహానటి’, ‘ఖైదీ […]

Written By: Neelambaram, Updated On : July 17, 2020 8:21 pm
Follow us on


సాయిమాధవ్ బుర్రా. మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారైనా కలవాలని హైదరాబాద్‌కు వచ్చిన ఆయన… ఏకంగా ఆయన సినిమాలకే మాటలు రాసే రచయితగా ఎదిగాడు. టాలీవుడ్‌లో ఇప్పుడు సాయి మాధమ్‌ చాలా ఫేమస్‌. పరుచూరి బ్రదర్స్‌ తర్వాత ఆ స్థాయిలో పవర్ఫుల్‌ డైలాగ్స్‌ రాయడంలో దిట్ట. ‘కృష్ణం వందే జగద్గురుమ్’తో టాలీవుడ్‌కు పరిచయం అయిన బుర్రా ఫస్ట్ మూవీతోనే అద్భుత డైలాగ్స్‌తో మెప్పించాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘గోపాల గోపాల’, ‘మహానటి’, ‘ఖైదీ నెంబర్ 150’తో పాటు ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు పార్టులు, ‘సైరా నరసింహరెడ్డి’కి మాటలు అందించాడు. ప్రతి సినిమాలో తన మార్కు చూపించి స్టార్ రైటర్గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు పని చేస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్‌ చరణ్హీరోలుగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థీమ్‌ టీజర్, ఇటీవల రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన అల్లూరి సీతారామరాజు ఇంట్రో ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా రామరాజుగా చరణ్ను ఇంట్రడ్యూస్‌ చేస్తూ ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చిన డైలాగ్స్‌ అయితే పేలిపోయాయి. ఆ డైలాగ్స్ రాసింది సాయిమాధవ్ బుర్రానే.

సినిమా వాళ్లకు ఒక పీడకల !

ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన పోషిస్తున్న కోమరం భీమ్‌ ట్రైలర్ను విడుదల చేద్దామనుకున్నా.. లాక్‌డౌన్‌ కారణంగా ప్యాచ్‌వర్క్‌ పూర్తికాకపోవడంతో అది సాధ్యపడలేదు. ఎన్టీఆర్కు ఇంట్రడక్షన్‌ వాయిస్‌ ఓవర్ చరణ్‌ ఇస్తాడని, కోమురం భీం గురించి కూడా పవర్ఫుల్ డైలాగ్స్‌ ఉంటాయా లేదా? అన్న చర్చ మొదలైంది.ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి మాధవ్.. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్టు ఉంటాయని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్నట్టు ఉండదని స్పష్టం చేశాడు. దర్శకుడు రాజమౌళి రెండు పాత్రలను బ్యాలెన్స్ చేశారన్నాడు. తాను కూడా అదే స్థాయిలో ఇద్దరికీ డైలాగ్స్ రాశానని తెలిపాడు. అంతేకాదు మూవీలో ఇద్దరి పాత్రల నిడివి కూడా సమానంగా ఉంటుందని, ఈ విషయంలో ఫ్యాన్స్‌ అనుమాన పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అలాగే, రాజమౌళి దీన్ని మరో స్థాయి మూవీలా తెరకెక్కిస్తున్నారని, ఫ్యాన్స్‌ అంచనాలను ఈజీగా రీచ్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.