https://oktelugu.com/

ప్రభాస్‌ మళ్లీ డబుల్‌ యాక్షన్‌!

‘బహుబలి’ తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ పెరిగింది. ఆయన సినిమాలన్నీ ఇక పాన్‌ ఇండియా మూవీసే. విదేశాల్లో కూడా అనేక మంది అభిమానులు ఉండడంతో ఆ స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని మూవీ మేకర్స్‌ ప్రభాస్‌ కోసం కథలు సిద్దం చేస్తున్నారు. అలా భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘సాహో’ తెలుగులో ఆడకపోయినా.. బాలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు మన రెబల్‌ స్టార్ ‘రాధేశ్యామ్‌’ అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా రిలైజన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 08:34 PM IST
    Follow us on


    ‘బహుబలి’ తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ పెరిగింది. ఆయన సినిమాలన్నీ ఇక పాన్‌ ఇండియా మూవీసే. విదేశాల్లో కూడా అనేక మంది అభిమానులు ఉండడంతో ఆ స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని మూవీ మేకర్స్‌ ప్రభాస్‌ కోసం కథలు సిద్దం చేస్తున్నారు. అలా భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘సాహో’ తెలుగులో ఆడకపోయినా.. బాలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు మన రెబల్‌ స్టార్ ‘రాధేశ్యామ్‌’ అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా రిలైజన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్టు నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తున్న చిత్ర బృందం.. బాహుబలి రిలీజైన్‌ ఏప్రిల్‌ 24వ తేదీన (వచ్చే ఏడాది) రాధేశ్యామ్‌ను విడుదల చేయాలని చూస్తున్నారు. రాధాకృష్ణకుమార్ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో భారీ బజ్జెట్‌ చిత్రానికి రెబల్‌ స్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అశ్వినీదత్‌ పాన్‌ ఇండియా మూవీగా నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటారన్న టాక్‌ నడుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే దీపికను కలిసి కథ వినిపించింది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేసిన ‘మహానటి’ కూడా చూసిన దీపిక.. మూవీ బాగుంది అందరూ చూడాలని ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా చేసింది. దాంతో, ప్రభాస్‌తో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్టు అర్థమవుతోంది. కానీ, భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో ఇప్పుడు బంతి నిర్మాత కోర్టులో ఉంది.

    పాపులర్ సెక్స్‌ వర్కర్ పాత్రలో రకుల్‌!

    ఇక, ఈ మూవీకి సంబంధించి లేటస్ట్‌గా మరో ఇంట్రస్టింగ్‌ సమాచారం తెలిసింది. ఈ మూవీలో ప్రభాస్‌ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నాడని సమాచారం. పునర్జన్మల బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రంలో మన డార్లింగ్‌ ఇద్దరు పురాణ పురుషుల్ని పోలి ఉండేలా రెండు పాత్రలు ఉంటాయట. అలాగే, ఇది రెండు వేర్వేరు కాలాల్లో జరిగే కథ అని సమాచారం. ఈ రెండు పాత్రలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎలా లింగ్‌ చేస్తాడన్నదే అసలు పాయింట్‌ అట. కాగా, ప్రభాస్‌ డబుల్‌ రోల్ చేయడం కొత్తేం కాదు. బిల్లాతో పాటు బాహుబలిలో రెండు పాత్రల్లో నటించారు. కాకపోతే ఆ రెండు పాత్రలూ ఒకేసారి కనిపించలేదు, కలుసుకోలేదు. మరి, తాజా మూవీలో ఏవిధంగా ఉంటాయన్నది ఆసక్తికరం.