Homeఎంటర్టైన్మెంట్Kangana: తనపై నమోదైన కేసులపై విచిత్రంగా స్పందించిన కంగనా.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

Kangana: తనపై నమోదైన కేసులపై విచిత్రంగా స్పందించిన కంగనా.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

Kangana: నిత్యం వివాదాల్లో హాట్​టాపిక్​గా మారి బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్​గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్​. తాజాగా,  సిక్కులపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఆమెపై పలు చోట్ల పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, మొన్న వ్యవసాయ చట్టాల ఉపసంహరణ విషయంలోనూ తనదైన రీతిలో స్పందించి.. వివాదాలను కొనితెచ్చుకుంది కంగన. ఈ క్రమంలోనే రైతులనుద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి.

kangana
Kangana

ఈ అంశంపైనా ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని  ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్‌’ఉద్యమం అని, సిక్కులను అవమానించిందని  ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: ప్చ్.. కంగనా వాళ్లకు కూడా చూపించేసింది !

తాజాగా ఈ విషయంపైనా స్పందించి.. సోషల్​మీడియాలో కంగన పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

చేతిలో వైన్​గ్లాస్​ పట్టుకుని.. తన ఫొటోను ఇన్​స్టా స్టోరీలో పోస్ట్​ చేస్తూ.. ఇంకో ఎఫ్​ఐర్​. ఇలా నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్లు మా ఇంటి దగ్గరకు వస్తే.. నా మూడ్​ ఇదే.. అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు, రైతుల విషయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారికి తనదైన శైలిలో వ్యంగంగా సమాధానమిచ్చింది కంగన.

కంగనకు ఈ వివాదాలు కొత్తేం కాదు, గతంలోనే పలు రాజకీయ, సామాజిక, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. వివాదాల్లో నిలిచింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: మోదీ వ్యవసాయ చట్టాల నిర్ణయంపై కంగన అలా.. తాప్సీ ఇలా!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version